AP Aadhaar Camps : ఏపీలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్, ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, ఫోన్ నెంబర్ అప్డేట్ వంటి సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో…గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆధార్ క్యాంపులను మరో 2, 3 రోజులు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.