Telangana

గ్రేటర్ వరంగల్ ముంగిట మరో ఛాలెంజ్- నెగ్గితే రూ.రూ.135 కోట్లు దక్కే ఛాన్స్-warangal news in telugu citiis challenge gwmc participate in smart city scheme ,తెలంగాణ న్యూస్



నగరానికి గుర్తింపు దక్కడం హర్షణీయం- మేయర్ గుండు సుధారాణికేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్ కు వరంగల్ ఎంపిక కావడం హర్షనీయమని గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​గుండు సుధారాణి అన్నారు. దేశవ్యాప్తంగా 84 స్మార్ట్ సిటీ నగరాల్లో వరంగల్ కు కూడా చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కు దేశంలోని ఫాస్ట్ మూవింగ్ సిటీస్ లో చోటు దక్కిందని, భవిష్యత్తులో మిగిలిన పథకాలలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తామని మేయర్​స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో గ్రేటర్ వరంగల్ ను ముందంజలో నిలిపే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ ఛాలెంజ్​ ఒక మైలురాయిగా నిలుస్తుందని మేయర్​ గుండు సుధారాణి చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిపుణులు, అధికారుల సలహాలు తీసుకుని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని మేయర్​స్పష్టం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఛాలెంజ్ కు వరంగల్ నగరం ఎంపిక కావడంతో గ్రేటర్ అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఛాలెంజ్ లో నెగ్గి నగర అభివృద్ధి లో భాగస్వాములు కావడంతో పాటు మరిన్ని నిధులతో గ్రేటర్ వరంగల్ ను దేశంలోనే అగ్ర భాగంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.



Source link

Related posts

సిద్దిపేటలో విషాదం, వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య-siddipet crime news in telugu woman committed suicide on dowry threats mother in law family ,తెలంగాణ న్యూస్

Oknews

మాజీ ఎంపీ వర్సెస్ ఎంపీ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ-hyderabad crime bjp ex mp konda vishweshwara rao complaint on brs mp ranjith reddy ,తెలంగాణ న్యూస్

Oknews

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 4, 5 తేదీల్లో ఎంట్రన్స్…-ts icet 2024 released entrance on 4th and 5th june online applications from tomorrow ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment