ఆల్ ఇండియా కృష్ణా మహేష్ ప్రజా సేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి ఆధ్వర్యంలో ఈరోజు పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ ముద్దుల మనవడు ఘట్టమనేని జయకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. త్వరలో తెలుగు సినిమా రంగానికి హీరోగా పరిచయం కాబోతున్న జయకృష్ణ ఎవరో కాదు.. మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో జయ కృష్ణ తో పాటు అతని తల్లి మృదుల పాల్గొన్నారు. ఖాదర్ గోరి ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా జయ కృష్ణకు భారీ గజమాలతో సన్మానం చేశారు.
అనంతరం ఖాదర్ గోరి మాట్లాడుతూ.. “ఘట్టమనేని అభిమానులందరం మీ రాక కొరకు ఎదురుచూస్తున్నాము. అభిమానులు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అన్నారు.
జయ కృష్ణ మాట్లాడుతూ.. “త్వరలోనే సినిమా మొదలవుతుంది. అలాగే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తాత గారి అభిమానులు, నాన్నగారి అభిమానులు, బాబాయ్ గారి అభిమానులు అందరికీ ధన్యవాదాలు.” అన్నారు.
మృదుల మాట్లాడుతూ.. “కొన్ని కథలు విన్నాము. అందరం విని ఒక స్టోరీని ఓకే చేస్తాను. మంచి బ్యానర్ లో మంచి సినిమాతోనే వస్తారు.” అన్నారు.