Top Stories

చంద్రబాబు ఆరోగ్యంపై అర్థంలేని విలాపాలు!


73 ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తి, ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన కేసుల్లో ప్రస్తుతం రిమాండు కింద జైల్లో ఉన్నాడు. దాదాదాపు నాలుగు దశాబ్దాలు పైబడి నిత్యం ఏసీల్లోనే బతికిన వైభోగం ఖచ్చితంగా శరీరాన్ని ఎంతో దుర్బలంగా మార్చి ఉంటుంది. 

ఇప్పుడు హఠాత్తుగా జైలు వాతావరణంలో ఉండడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు, ఒంట్లో నలత చేయడానికి దారి తీయడం చాలా సహజం. ఆస్పత్రికి వెళ్లి బాగు చేయించుకోవాలి.. అంతే తప్ప.. చంపేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదంటూ ఆవేదన వ్యక్తం చేయడం, విలాపాలు సాగించడం ఏ రకంగా సబబు?

చంద్రబాబునాయుడుకు కేవలం అలర్జీ వచ్చింది. జైలు జీవితం గడుపుతున్నప్పుడు.. కొన్ని నిబంధనల్ని అనుసరించాల్సి ఉంటుంది. తాను చక్రవర్తినని, తాము రాజరికంలో ఉన్నాం అని భావించడానికి వీల్లేదు. ఆ నిబంధనల ప్రకారం వైద్యులు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. మందులు ఇచ్చారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నం తాము చేస్తే స్టెరాయిడ్స్ ఇచ్చి చంపేసే ప్రయత్నం చేస్తున్నారని నింద వేయడం ఏ రకంగా సబబు?

73ఏళ్ల చంద్రబాబునాయుడుకు ఒంట్లో నలత చేసింది గనుక రాష్ట్రమంతా విలపించాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నది. విప్లవ కవి వరవరరావు 81 ఏళ్ల వయసులో ఒక కుట్ర కేసులో భాగస్వామి అనే అనుమానంతో రిమాండు ఖైదీగా రెండున్నరేళ్లపాటూ జైలుకు పరిమితమై.. నానా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనాతో కూడా బాధపడ్డారు. సుదీర్ఘమైన న్యాయపోరాటం తర్వాత ఆయనకు బెయిల్ పై వచ్చింది. మరి ఆయన గురించి చంద్రబాబునాయుడు తన జీవితంలో ఎన్నడైనా ఒక కన్నీటి బొట్టు కార్చారా? మరి చంద్రబాబు గురించి మాత్రం లోకమంతా ఏడవాలని ఎందుకు కోరుకుంటున్నారు?

పైగా వరవరరావు కేవలం ఉద్యమకారులతో సంబంధం ఉన్నందుకు అరెస్టు అయ్యారు.. చంద్రబాబునాయుడు అలా కాదు, వందల కోట్ల ప్రజాధనాన్ని- అదే ప్రజలు తనకు అందించిన అధికారాన్న అడ్డుపెట్టుకుని కాజేసినందుకు, స్వాహా చేసినందుకు జైల్లో ఉన్నారు. ఎవరి గురించి ప్రజలు విలపించాలి?

ఒక్క విషయం మాత్రం నిజం.. చంద్రబాబునాయుడు అరెస్టు వ్యవహారానికి సంబంధించి.. ప్రతి అంశాన్నీ రాద్ధాంతం చేయడం ద్వారా రాజకీయ మైలేజీ పొందాలని తెలుగుదేశం పార్టీ కుట్రరచన చేస్తున్నది. 

కొంద‌రు వైసీపీ వాళ్లు అతిశయంగా అంటున్నట్టుగా ఆయనను చంపడానికి ఆ పార్టీ స్వయంగా ప్రయత్నించకపోవచ్చు. కానీ, మరికొందరు వైసీపీ నాయకులు అంటున్నట్టుగా.. ఆయనకు నిజంగా అనారోగ్యం ఉంటే గనుక.. కోర్టుకు వెళ్లి మెరుగైన చికిత్స పొందడానికి, తమ డాక్టర్లతో చికిత్స నిర్వహింపజేసుకోవడానికి, లేదా ఆస్పత్రికి తరలించడానికి, లేదా ఆ అనారోగ్య కారణాల మీద బెయిలుకు వారు ప్రయత్నించవచ్చు. కానీ, ఆ పనేం చేయకుండా.. కేవలం ప్రభుత్వం నిందలు వేస్తూ కాలం గడపాలని వారు అనుకోవడమే.. అబద్ధపు దొంగ ఏడుపులకు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.



Source link

Related posts

‘కిస్మత్‌' టైటిల్ సాంగ్

Oknews

క‌డ‌ప‌లో వైసీపీకి అంత ఈజీ కాదు!

Oknews

కోమటిరెడ్డి, వివేక్ ఫిరాయిస్తే, బాధ్యత ఎవరిది?

Oknews

Leave a Comment