గురువారంతో చంద్రబాబు రిమాండ్ 40 రోజులు ముగియడంతో బాబును విచారణ కోసం వర్చువల్‌గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున దమ్మాలపాటి, సిఐడి తరపున వివేకానంద వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతున్నందున నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు చంద్రబాబుకు వివరించారు.