Skill Development Scam: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై అత్యవసర కారణాలతో వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్, లూథ్రాలు వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించగా.. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం… తీర్పును రిజర్వు చేసింది. రేపు నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక మెయిన్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఎపుడు చేపట్టాలో రేపే నిర్ణయం తీసుకుంటామని తీర్పులో పేర్కొన్నారు.