Health Care

చనిపోయిన వారికి RIP అని ఎందుకు పెడతారో తెలుసా.. అసలు ఈ పదం ఎక్కడ నుంచి వచ్చిందంటే!


దిశ, ఫీచర్స్: ఎవరైన చనిపోతే వారికి నివాళి ఆర్పిస్తూ.. వారి ఆత్మకు శాంతి కలగాలి అనే అర్థంతో RIP అని పెడతారు. అయితే.. ఈ RIP అనే పదం అసలు ఎక్కడ నుంచి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా. ఈరోజుకు చాలా మందికి RIP అనే పదానికి అసలైన అర్థం తెలియదు. కానీ చనిపోయిన వాళ్ల గురించి పెడతారు అని మాత్రం తెలుసు. అయితే.. RIP అనే పదానికి అసలైన అర్థం ‘శాంతిలో విశ్రాంతి’. ఇది లాటిన్ పదబంధమైన ‘రిక్విస్కాట్ ఇన్ పేస్’ నుండి ఉద్భవించిందనట. అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ‘శాంతియుతంగా నిద్రించడం’ అని అర్థం వస్తుంది.

RIP అనే పదం 18వ శతాబ్దంలో ఉద్భవించింది. అయితే.. నిజానికి క్రైస్తవ మతం కారణంగా ఈ పదానికి ప్రజాదరణ పెరిగింది. అప్పుడు మరణించిన వ్యక్తుల సమాధులపై ‘రిక్విస్‌కాట్ ఇన్ పేస్’ అని ఈ పదం రాసేవారట. తెలుగు భాషలో ప్రజలు.. మరణంచిన వ్యక్తి ఫోటో క్రింద ‘దేవుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించు’ అని వ్రాస్తారు. అదే ఆంగ్ల భాషలో ‘రిక్విస్‌కాట్ ఇన్ పేస్’ అని రాస్తారు. క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు ఈ పదాన్ని RIPగా మార్చి.. చనిపోయిన వారి సమాధులపై ప్రచురించడం జరిగింది. ఇక కాలక్రమేనా ఈ పదానికి ప్రజాదారణం పెరగడంతో.. అన్ని మతాల వారు కూడా RIP అని రాస్తున్నారు.



Source link

Related posts

శ్రీకృష్ణుడు 16 వేల వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసా..

Oknews

వైరల్‌గా బర్రెలక్క వెడ్డింగ్ కార్డు.. అక్క మొగుడు దొరికేశాడు అంటూ నెట్టింట రచ్చ (వీడియో)

Oknews

అది ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం.. స్పెషాలిటీ ఏంటంటే..

Oknews

Leave a Comment