Entertainment

చరణ్ తో గొడవ.. ఒక్క పోస్ట్ తో అదిరిపోయే రిప్లై ఇచ్చిన బన్నీ!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మధ్య దూరం పెరిగింది అంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వారి సన్నిహితులు ఆ వార్తలను కొట్టిపారేస్తున్నా.. ఆ ప్రచారానికి మాత్రం చెక్ పడటంలేదు. అయితే తాజాగా బన్నీ సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోస్ట్ తో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టాడు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ బావ బామ్మర్దులు అవుతారు. స్టార్స్ అవకముందు, అయిన తర్వాత కూడా వీరిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరిద్దరూ డిస్టాన్స్ మెయింటైన్ చేస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా బన్నీ ఎందుకనో చరణ్ ని దూరం పెడుతున్నాడనే కామెంట్స్ వినిపించాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలిచినప్పుడు.. అందులో తన కుటుంబానికి చెందిన హీరో రామ్ చరణ్ కూడా ఉన్నప్పటికీ, తను బావ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ ని “తెలుగు ప్రైడ్” అంటూ అల్లు అర్జున్ ప్రత్యేకంగా సంబోధించాడు. ఆ సమయంలో చరణ్ అభిమానులు ఎంతో హర్ట్ అయ్యారు.

అలాగే ‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్న సమయంలో.. “శుభాకాంక్షలు బావ” అంటూ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేయగా.. “నీ జెన్యూన్ విషెస్ కి థాంక్యూ బావ” అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే చరణ్ మాత్రం బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపకుండా, మిగతా విజేతలతో కలిపి విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే బన్నీ కూడా “థాంక్యూ” అంటూ ఏదో బయటవారికి ఇచ్చినట్లుగా ఫార్మాలిటీ రిప్లై ఇచ్చాడు. దాంతో బన్నీ, చరణ్ మధ్య దూరం పెరిగిందనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఆ తర్వాత బన్నీకి విషెస్ తెలుపుతూ చరణ్ ప్రత్యేకంగా బొకే పంపించడంతో ఆ వార్తలకు చెక్ పడింది. 

కానీ మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి సమయంలో.. బన్నీ-చరణ్ మధ్య దూరం పెరిగిందనే వార్తలు మళ్ళీ వినిపించాయి. వరుణ్, లావణ్య పెళ్ళికి ముందు.. మెగా, అల్లు ఫ్యామిలీలు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఇచ్చాయి. మొదట మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో పార్టీ ఇవ్వగా.. దానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు కానీ, బన్నీ మాత్రం స్కిప్ చేశాడు. ఆ తర్వాత అల్లు ఫ్యామిలీ పార్టీ ఇవ్వగా.. దానిని చరణ్ స్కిప్ చేశాడు. దీంతో బన్నీ, చరణ్ కావాలనే ఒకరికొకరు ఎదురు పడటం లేదని ఆ సమయంలో కొందరు కామెంట్స్ చేశారు.

ఇలా గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తాజాగా ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో చెక్ పెట్టాడు బన్నీ. చరణ్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. “నా మోస్ట్ స్పెషల్ కజిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను.” అంటూ బన్నీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో చరణ్, బన్నీ కలిసి ‘నాటు నాటు’ స్టెప్పులేయడంతో పాటు, ‘తగ్గేదేలే’ మ్యానరిజమ్ చేసినట్లుగా ఉంది. ఈ వీడియో చూసి ఇరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ కొందరు అనవసరమైన న్యూస్ క్రియేట్ చేసి అభిమానుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.



Source link

Related posts

'కల్కి' ప్రభంజనం.. 'బాహుబలి 2' రికార్డుకి ఎసరు!

Oknews

అది ప్రభాస్ ది కాదు.. ఫ్యాన్స్ రిలాక్స్ 

Oknews

sherlyn-chopra shocking comments on casting couch code word

Oknews

Leave a Comment