Health Care

చాక్లెట్ తినడం వల్ల గుండెపోటు, క్యాన్సర్‌లను చెక్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?


దిశ, ఫీచర్స్: సాధారణంగా చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొంత మందికి వీటిని తినడం వల్ల దంతాల నొప్పి రావడం జరుగుతుంది. దీంతో చాక్లేట్స్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అని భావిస్తుంటారు. మరి చాక్లేట్స్ తినడం వల్ల లాభాలా.. నష్టాలా.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

చాక్లెట్ తినడం వల్ల మంచి టేస్ట్‌తో పాటు దానిలో ఉండే పోషకాల వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఏ వ్యాధులకు చాక్లెట్ మెడిసిన్‌లా పని చేస్తుంది? దీన్ని ఎవరు తింటే మంచిదో ఇక్కడ చూద్దాం.

* డార్క్ చాక్లెట్ గుండెపోటును నివారించడంలో, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నివేదించబడింది.

* అలాగే చాక్లెట్ జీవక్రియను పెంచడం ద్వారా అజీర్ణ సమస్యలు , మలబద్ధకం కూడా తొలగిపోతాయి. ఇవన్నీ జీర్ణాశయానికి మేలు చేస్తాయి , బరువు తగ్గడానికి సహాయపడతాయి.

* అదేవిధంగా చాక్లెట్‌లో చర్మ కాంతిని పెంచేందుకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి మెరిసే చర్మానికి మేలు చేస్తుంది. ఇది UV కిరణాల నుండి చర్మాన్ని కూడా రక్షిస్తుంది.

* చాక్లెట్ మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

* మధుమేహం ఉన్నవారు చాక్లెట్ తీసుకోవద్దని సలహా ఇస్తారు కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, డార్క్ చాక్లెట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

* డార్క్ చాక్లెట్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నివేదికల నుండి క్యాన్సర్‌ను నివారించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

*కాబట్టి చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

రీల్స్ కోసం యువతి పిచ్చిచేష్టలు .. చూసి చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఇదిగో వీడియో

Oknews

ఈ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు ఉండవు.. కారణం ఏంటంటే?

Oknews

నెలరోజులు చక్కెర తినడం మానేస్తే.. బెనిఫిట్స్ ఇవిగో..

Oknews

Leave a Comment