Health Care

చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా? ప్రమాదంలో పడ్డట్లే..!!


దిశ, ఫీచర్స్: ‘చికెన్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. దీనిలో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గేందుకు ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అందరికీ అందుబాటులో ఉండే చికెన్ మిగతా నాన్‌వెజ్ ఐటెమ్స్‌ కంటే కాస్తా తక్కువ ధరలోనే లభిస్తుంది’. చికెన్‌‌ను చిన్న నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువగా డైట్ చేసేవారు గ్రిల్డ్ చికెన్ ను ఎక్కువగా తింటుంటారు.

డాక్టర్లు కూడా చికెన్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే చాలా మందికి చికెన్ లో ఏ భాగం మంచిది? కోడి చర్మం ఆరోగ్యానికి ప్రమాదకరమా? చికెన్ లో ఏ చికెన్ మంచిది? చికెన్ తింటే బరువు నిజంగా కంట్రోల్ లో ఉంటుందా? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా నిపుణులు వీటిపై క్లారిటీ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్ తాజాగా ఉండేందుకు కెమికల్స్ కలిపే చాన్స్ ఉంది. కాబట్టి చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇప్పటికే కార్డియాలజిస్టులు చికెన్ స్కిన్ తినకూడదని, స్కిన్ లెస్ చికెన్ తింటేనే మేలని సలహా ఇచ్చారు. ఎందుకంటే చికెన్ స్కిన్ లో అసంతృప్తి కొవ్వు అధికంగా ఉంటుంది. అలాగే చికెన్ తోలులో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుకు దారి తీసే అవకాశాలున్నాయి.

చికెన్ తోలులో ఒమేగా 3 అండ్ ఒమేగా 6 కొవ్వులు ఉంటాయి. కాబట్టి నెలలో రెండు సార్లు తింటే ఏం ప్రాబ్లమ్ ఉండదని చెబుతున్నారు. అయితే చికెన్ లో ఏ భాగం మంచిదంటే? చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్లు ఉంటాయి. ఇది బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకుండా కండరాల నిర్మాణానికి చికెన్ బ్రెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు.

చికెన్ తోడలో ఎక్కువ గా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి చికెన్ ను ఫ్రైడ్ కంటే గ్రిల్ చేసి తినడం మేలు. గ్రిల్ చికెన్ తింటే బరువు పెరగరు. ఫామ్ చికెన్ కంటే ఫారం చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కోళ్లు సహజ వాతావరణంలో పెరుగుతాయి. ఫారం కోళ్లలా త్వరగా పెరగవు. కాగా ఫామ్ కోడి కంటే నాట్ కోడి చికెన్ తింటే హెల్త్ కు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.



Source link

Related posts

అతిగా ఆలోచిస్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!

Oknews

టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?.. ఈ స్టోరీ వింటే..

Oknews

మాఘ మాసం ప్రాముఖ్యత ఏమిటి.. నదీ స్నానం ఎందుకు చేయాలి..

Oknews

Leave a Comment