Entertainment

చిరంజీవి కొత్త చిత్రంలో హనుమన్ నటి!


మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi)తన కొత్త చిత్రాన్ని వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నాడనే  విషయం అందరికి తెలిసిందే. ఈ  మూవీలో వింటేజ్ చిరంజీవిని చూడటంతో పాటుగా  ఒక సరికొత్త సినిమాని చూస్తారని  ఖచ్చితంగా మెగాస్టార్ అభిమానులని ప్రేక్షకులని మా మూవీ అలరిస్తుందని వశిష్ట చెప్పడంతో  అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన  న్యూస్ ఒకటి  టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

మెగా 156 గా తెరకెక్కుతున్నఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi sarath kumar) ఒక కీలక పాత్రలో నటించబోతుందనే విషయం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.కథకి సంబంధించి ఒక కీలక పాత్ర ఉందని ఆ క్యారక్టర్ కి వరలక్ష్మిని తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ భావిస్తున్నారని అంటున్నారు.అదే కనుక జరిగితే వరలక్ష్మి దశ తిరిగినట్టే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక వరలక్ష్మి విషయానికి వస్తే  ఆమె ఎలాంటి పాత్రని అయినా అవలీలగా పోషించగలదు. పైగా ఆ పాత్రని ప్రేక్షకులు ప్రేమించేలా చెయ్యడం వరలక్ష్మి నటనకి ఉన్న స్టైల్. అసలు  వరలక్ష్మి సినిమాలో ఉందంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అనే సంకేతాలు కూడా అటు పరిశ్రమ వర్గాల్లోను ప్రేక్షక వర్గాల్లోను ఏర్పడింది.

వరలక్ష్మి ఇటీవల వచ్చిన హనుమాన్ మూవీలో అంజమ్మ అనే క్యారక్టర్ లో సూపర్ గా నటించి అందరి చేత  శభాష్ అనిపించుకుంది.ఈ మూవీనే కాదు తన గత చిత్రాల్లో కూడా ఆమె  అధ్బుతంగా నటించి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించింది.ఇక మెగా 156 కి  విశ్వంభర అనే టైటిల్ ని చిత్ర వర్గాలు అనుకుంటున్నాయి.  చిరు ఇటీవలే పద్మభూషణుడు కాస్తా పద్మ విభూషణుడు గా మారాడు   



Source link

Related posts

చంద్రబాబు పాత్రలో మహేష్

Oknews

చిన్నపిల్లవాడు ఎదిగిపోయాడు.. పవన్ పై పరుచూరి వ్యాఖ్య  

Oknews

షాకింగ్.. రోడ్డు ప్రమాదంలో సోహైల్ మృతి…

Oknews

Leave a Comment