ByGanesh
Wed 20th Mar 2024 08:41 PM
మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసే అవకాశం వస్తే ఏ హీరో అయినా వదులుకుంటారా.. చిరు సినిమాలో చిన్న చిన్న రోల్స్ లో అప్పట్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ లాంటి హీరోలు నటించారు. కానీ ఇప్పుడొక హీరో మెగాస్టార్ చిరు ఆఫర్స్ ని రెండుసార్లు వదులుకున్నారట. ఆ హీరో ఎవరో కాదు ఈ మధ్యన ప్యాన్ ఇండియా ఫిలిం సలార్ లో ప్రభాస్ తో పోటీగా నటించిన మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్.
పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ డ్రామా ది గోట్ లైఫ్(తెలుగు ఆడు జీవితం) చితం విడుదల సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు సార్లు తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు, నాకు నటించాలని ఇంట్రెస్ట్ ఉన్నా నేను డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. చిరు నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహ రెడ్డి లో ఒక పాత్ర కోసం తనను సంప్రదించిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.
సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరు తో కలిసి నటించాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, నేను ఆడు జీవితం అనే ఒక చిత్రం చేస్తున్నా, లార్జర్ దేన్ లైఫ్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాను అని చిరు గారికి చెప్పాను. ఆ తర్వాత కూడా లూసిఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో నేను ఒరిజినల్ లూసిఫెర్ లో నటించిన రోల్ కోసం అడగగా, అప్పుడు కూడా ఆడు జీవితం చిత్రం కి సంబందించి వేరే పనుల్లో బిజీగా ఉన్న విషయాన్ని తెలిపినట్లుగా.. అలా చిరుతో రెండుసార్లు నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నట్లుగా పృథ్వీ రాజ్ చెప్పుకొచ్చారు.
The hero who missed the Chiru offer twice:
Prithviraj Sukumaran reveals why he was rejected Chiranjeevi offers