చెప్పుల్లేకుండా పచ్చగడ్డి మీద నడిస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?


posted on Apr 10, 2024 11:27AM

వాకింగ్ సాధారణంగా ఆరోగ్యం కోసం చాలామంది చేసే సింపుల్ వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. అయితే మరిన్ని అదనపు ప్రయోజనాలు కావాలంటే ఈ వాకింగ్ లో కూడా విభిన్న మార్గాలు అనుసరించాలి. అలాంటి వాటిలో గ్రొండింగ్ లేదా ఎర్తింగ్ కూడా ఒకటి.  చెప్పులు లేకుండా ఒట్టి పదాలతో పచ్చగడ్డి మీద నడవడమే గ్రౌండింగ్.  దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే..

కనెక్షన్..

చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద ఒట్టి పాదాలతో నడవడం వల్ల మనసుకు, శరీరానికి మధ్య కనెక్షన్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా భూమి నుండి ఎలక్ట్రాన్ లు శరీరానికి బదిలీ అవుతాయి.ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో సహజంగా ఉండే విద్యుత్ శక్తి బ్యాలెన్స్ గా ఉండటంలో తోడ్పడుతుంది.

స్ట్రెస్ తగ్గుతుంది..

పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు మీద శరీరం మీద భారం తగ్గినట్టు అనిపిస్తుంది.  ఇది మానసిక స్థితిని బ్యాలెన్స్ గా ఉంచుతుంది.


శక్తి ప్రవాహం..

మనిషి శరీరంలో ఉండే చాలా నరాలు పాదాల దగ్గర ముగుస్తాయి. అంటే శరీరంలో నరాలకు ముగింపు పాదాల భాగం. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడిస్తే పాదాలలో ఉండే నరాల పిఫ్లెక్స్ పాయింట్లు  యాక్టీవ్ అవుతాయి. ఇవి శరీరం అంతా మెరుగైన రక్తప్రసరణ, ఆక్సిజన్ సప్లై, శక్తి ప్రవాహానికి సహాయపడతాయి.

భూమితో కనెక్షన్..

ఇప్పట్లో ఇంట్లో ఉంటున్నా కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నారు చాలామంది. దీనివల్ల భూమికి, మనిషికి మధ్య  కనెక్షన్ తగ్గిపోతోంది. కానీ చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం వల్ల మళ్లీ భూమితో శరీరానికి అద్భుతమైన కనెక్షన్ ఏర్పడుతుంది. భూమి గురుత్వాకర్షణ బలం శరీరానికి అంది శరీరం దృఢంగా మారుతుంది.

రోగనిరోధక శక్తి..

మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవి కూడా ఉంటాయి. పచ్చగడ్డి మీద నడవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  అనారోగ్యాలు ఎదురైతే వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రకృతిలో ఆరుబయట నడవడం వల్ల మానసిక, శారీరక స్థితి మెరుగవుతుంది.

                                            *నిశ్శబ్ద.



Source link

Leave a Comment