Top Stories

జనసేనను అసహ్యించుకునేలా చేస్తున్న నాదెండ్ల!


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన అత్యుత్తమ విద్యావకాశాలు అందాలనే సదుద్దేశంతో అనేకానేక పథకాలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విధానాన్ని కూడా ప్రారంభించడం అందుకే. 

ఇలాంటి ప్రయత్నాలనే ఓర్వలేనే అనేకమంది.. రకరకాల విషపూరిత మాటలతో ఆ ప్రయత్నాన్ని నీరుగార్చేలా విమర్శలు చేసినా.. ఆయన ముందుకు దూసుకువెళ్లారు. అలాగే.. విదేశాల్లో విద్య అభ్యసించడానికి ప్రాథమిక అవసరమైన టోఫెల్ పరీక్షకు సంబంధించి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పించడానికి జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. జనసేన పార్టీ ఆ ప్రయత్నం మీద విషం కక్కుతోంది.
 
పేదలకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంచడం, అది కూడా ఉచితంగా అందుబాటులో ఉంచడం అనేదే ప్రభుత్వం చేస్తున్న పాపం అన్నట్టుగా ఆ పార్టీ నెంబర్ టూ నాయకుడు నాదెండ్ల మనోహర్ విరుచుకుపడుతున్నారు. 

అమెరికాకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది కేవలం వేల మంది మాత్రమే వీసాలు తీసుకున్నారు. అలాంటి కోటి మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఆ అవకాశం అందితే.. వారు ఎదిగిపోతారేమో.. వారిలో చైతన్యం వస్తుందేమో అనే భయం జనసేనలో కనిపిస్తున్నట్టుగా ఉంది.
 
టోఫెల్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇప్పించడం అనేది కేవలం అమెరికాకు వెళ్లడానికి మాత్రమే కాదు.. ఏ విదేశంలో చదువుకోవడానికైనా ఇది ఒక ప్రమాణ పరీక్షగా ఉంటుంది. అలాంటప్పుడు ఏటా లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది.. అనే వాస్తవాన్ని నాదెండ్ల చాలా కన్వీనియెంట్ గా దాచి, అమెరికా గణాంకాలు మాత్రం చెబుతున్నారు. అలాగే టోఫెల్ పరీక్ష అనేది కేవలం విదేశాలకు వెళ్లడానికి మాత్రమే కాదు.. ఇంగ్లిషు లాంగ్వేజ్ స్కిల్స్ ను పిల్లలు పెంచుకోవడానికి బహుముఖంగా ఉపయోగపడుతుంది. 

విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ.. ఈ శిక్షణతో వారి ఇంగ్లిషు స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. పిల్లలు ఏ కాంపిటీటివ్ పరీక్షలకు అయినా మెరికల్లాగా తయారవుతారు. ఆ రకంగా యువతరం చైతన్యవంతం కావడం అనేది.. జనసేనకు ఇష్టం లేనట్టుగా ఉంది. జగన్ తీసుకొస్తున్న ఈ శిక్షణ ప్రయత్నాలను హర్షిస్తున్న పేదలు.. జనసేన పార్టీని అసహ్యించుకునేలా.. ఈ విమర్శలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు.



Source link

Related posts

అయోధ్యకు ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం?

Oknews

తేలిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్!

Oknews

మరో లాంగ్ వీకెండ్.. ఏ సినిమాకు ప్లస్?

Oknews

Leave a Comment