ఇంటి స్థలం, ఆర్థిక సాయం
ఈ సందర్భంగా డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కిషన్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే తాము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులకూ వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు తదితరులను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని పొందుపరచాలని కోరామన్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలను కలిసి మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల అంశం చేర్చాలని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పలు పార్టీలను కోరుతున్న సంగతి తెలిసిందే.