EntertainmentLatest News

జర్మనీ అడవుల్లో  మహేష్ ట్రెక్కింగ్…రాజమౌళి సినిమా కోసమే 


గుంటూరు కారం (guntur kaaram)తో బాక్స్ ఆఫీస్ వద్ద తన కట్ అవుట్ కి ఉన్న స్టామినా ఏమిటో మహేష్ (mahesh)మరోసారి నిరూపించాడు.దీంతో ఇప్పుడు అందరి దృష్టి మహేష్ నటిస్తున్న కొత్త సినిమా మీద పడింది.ఆ సినిమా రాజమౌళి (rajamouli)మహేష్ కాంబోలో ఉంటుందని తెలియగానే మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఆ సినిమా మీద ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా మహేష్  తన ఇనిస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలతో మహేష్ కొత్త సినిమా మీద  చర్చ మొదలయ్యింది.

మహేష్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. రాజమౌళి సినిమాకి సంబంధించిన  తన క్యారక్టర్ నిమిత్తం మహేష్ అక్కడ  ఫిట్ నెస్ ట్రైనింగ్ ని తీసుకుంటున్నాడు. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ హ్యారి కొనిగ్ పర్యవేక్షణలో  మహేష్ ట్రైనింగ్ ని తీసుకుంటున్నాడు.  తాజాగా మహేష్ తన ట్రైనర్ తో కలిసి  జర్మనీ లోనే ఎంతో పాపులర్ అయిన  బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేసాడు. ఇప్పుడు మహేష్ ఆ  ఫోటోలను  తన ఇనిస్టాగ్రామ్ లో పోస్ట్  చేసాడు.ప్రస్తుతం ఆ పిక్స్  సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో పాటు నెంబర్ ఆఫ్ లైక్స్ ని పొందుతున్నాయి  

 ఇక మహేష్, రాజమౌళిల సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా ఎప్పుడెప్పుడు ఆ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తుందా అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి  కథని విజయేంద్రప్రసాద్ పూర్తి చేసాడనే వార్తలైతే కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. మహేష్ కెరీర్లోనే  అత్యధిక బడ్జట్ తో రూపుదిద్దుకుంటున్నఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. 



Source link

Related posts

75 రోజుల పాటు అమలాపురంలో పట్టుబట్టి ఉన్న తెలుగు నటి…ముందుగానే ప్రిపేర్ 

Oknews

ఘనంగా ఘట్టమనేని వారసుడి జన్మదిన వేడుకలు.. త్వరలోనే హీరోగా ఎంట్రీ!

Oknews

సాఫ్ట్ గా వద్దు.. మాస్ అవతారమెత్తాల్సిందే!

Oknews

Leave a Comment