Telangana

జల్సాల కోసం గంజాయి సప్లై- జగిత్యాలలో ముఠా అరెస్ట్!-jagtial crime police arrested five members in ganja gang investigation on inter students case ,తెలంగాణ న్యూస్



Jagtial Ganja Case : జగిత్యాల జిల్లాలో గంజాయి(Ganja) మత్తుపై పోలీసులు స్పందించారు. మైనర్లు గంజాయికి అలవాటుపడి అనారోగ్యం పాలయ్యారని మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో గంజాయి సప్లై చేసే ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి పది కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్ లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సమక్షంలో అరెస్ట్ అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. రాయికల్, మల్లాపూర్ మండలాలకు పెనుగొండ గణేష్, మాలవత్ సతీష్ కుమార్, రావులకరి నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ లు జల్సాలకు అలవాటు పడి చదువు మానేసి ఏపీలోని సీలేరు నుంచి జగిత్యాలకు(Jagtial) గంజాయి సప్లై చేస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న ప్యాకెట్లలో జిల్లాలో గంజాయి విక్రయిస్తున్నారని చెప్పారు. జగిత్యాలలో బాలికలు గంజాయికి అలవాటుపడిన ఘటనకు ఈ ముఠాకు సంబంధంపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. బాలికలు గంజాయి మత్తుపై ఇంకా విచారణ కొనసాగుతుందని త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.



Source link

Related posts

భద్రాద్రి జిల్లాలో రూ.27 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం-bhadradri crime news in telugu police burnt 11 tones 27 crore worth ganja ,తెలంగాణ న్యూస్

Oknews

Kamareddy Boys Killed: చెరువులో దిగి ఒక బాలుడు, కాపాడే ప్రయత్నంలో మరో బాలుడి మృతి

Oknews

Govt Jobs 2024 : హైదరాబాద్‌ మింట్‌లో కొలువులు… 96 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య వివరాలివే

Oknews

Leave a Comment