NYC Flooding: అమెరికాలోని న్యూయార్క్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సబ్ వే ల్లోకి, విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. నగరంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని మేయర్ హెచ్చరించారు.