Entertainment

‘జవాన్‌’ డైరెక్టర్‌ అట్లీపై నయనతార సంచలన వ్యాఖ్యలు!


షారూక్‌ ఖాన్‌, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘జవాన్‌’ బాక్సాఫీస్‌ని కొల్లగొడుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చేసిన అట్లీకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 900 కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకుంది. ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు. 

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతార తన క్యారెక్టర్‌ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని కొన్ని వర్గాలను ఊటంకిస్తూ హిందుస్థాన్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ని కిల్‌ చేశారని, దీపిక క్యారెక్టర్‌ను బాగా హైలైట్‌ చేశారని ఆరోపించింది. వాస్తవానికి దీపిక ఈ సినిమాలో గెస్ట్‌గా నటించింది. అయితే ఇది షారూక్‌, దీపిక సినిమాలా ప్రజెంట్‌ చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోందని ఆ కథనంలో తెలిపారు. సౌత్‌లో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార ‘జవాన్‌’ చిత్రంలో తన క్యారెక్టర్‌ ట్రీట్‌మెంట్‌ విషయంలో హ్యాపీగా లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక ‘జవాన్‌’ సినిమా ప్రమోషన్‌, సక్సెస్‌మీట్‌ వంటి ఈవెంట్స్‌కి నయనతార దూరంగా వుండడానికి కారణం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు.. గతంలో జరిగిన ఈవెంట్లలో తనకు జరిగిన కొన్ని చేదు అనుభవాల కారణంగా ఈవెంట్లకు హాజరు కాలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. 



Source link

Related posts

ప్రభాస్‌ ‘కల్కి’ విషయంలో అలా చేస్తే జైలు శిక్ష తప్పదు

Oknews

ప్రేమలు మొదటి రోజు కలెక్షన్స్.. రాజమౌళి కొడుకు ఏమంటాడో  

Oknews

సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతోందా.. అందుకే అలా చేస్తోందా?

Oknews

Leave a Comment