Health Care

జిమ్‌లో నగ్నంగా వర్కవుట్స్ చేస్తున్న బ్రెజీలియన్ కపుల్.. వీడియో కూడా షేర్ చేస్తూ..


దిశ, ఫీచర్స్ : ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటిపై బట్టల్లేకుండా ఉండటానికి ఎవరూ సాహసించారు. షార్ట్స్ వేసుకొని ఉండటానికి కూడా కొందరు వెనుకాడుతుంటారు. తరచూ వ్యాయామాలు చేసేవారు, జిమ్‌కు వెళ్లి వర్కువట్స్ ట్రై చేసేవారు సైతం జిమ్ సూట్స్ లేదా తమ ఫిజికల్ యాక్టివిటీస్‌కు అనువైన దుస్తులను ధరించి వెళ్తుంటారు. మహా అయితే కొందరు పురుషులు మహా షర్ట్ విప్పేసి వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ మొత్తానికే బట్టల్లేకుండా దాదాపు ఎవరూ వర్కవుట్స్ చేయరు. కానీ ఒక జంట మాత్రం ఇలా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జిమ్ సెంటర్‌లో భార్యా భర్తలిద్దరూ కలిసి పూర్తి నగ్నంగా వర్కవుట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సంచలనంగా మారిన ఈ వివరాలేంటో చూద్దాం.

బ్రెజిల్ దేశంలోని సావో పాలోకు చెందిన బెల్లా మాంటోవానీ, వాగ్నర్ ఓ. ఫెరా భార్యా భర్తలు. వీరు 2010లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు తమ ఆచారా సంప్రదాయాల ప్రకారం నడ్చుకుంటే రొమాంటిక్ లైఫ్ అనుకున్న విధంగా ఎంజాయ్ చేయలేకపోతున్నారట. దీంతో ఆనందకరమైన శృంగార జీవితాన్ని ఆస్వాదించడానికి, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే.. జిమ్‌లో వర్కవుట్స్ చేయడానికి ఎటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అడ్డంకిగా ఉండవు కాబట్టి అక్కడ తాము నగ్నంగా వర్కవుట్స్ చేస్తూ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావించారట. ఇలా 2010 నుంచి జిమ్‌లో ఉన్నప్పుడు మొత్తం ఒంటిమీద బట్టలు విప్పేసి వర్కవుట్స్ చేస్తూ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నారట. పైగా ఇలా చేయడంవల్ల అధిక కేలరీలు బర్న్ అవుతాయని, ఆరోగ్యానికి మంచిదని ఈ జంట వాదిస్తుండగా నెటిజన్లు మాత్రం ఇదేం పనికి మాలిన ఆలోచన అంటూ తిట్టిపోస్తున్నారు.

అయితే మాంటోవానీ, వాగ్నర్ ఓ. ఫెరా నగ్నంగా వర్కవుట్స్ చేస్తే ఇతరులు ఎలా ఊరుకుంటారు? అసలు జిమ్ సెంటర్ నిర్వాహకులు ఎలా అనుమతిస్తారు? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. కానీ వీరు చేసే పనివల్ల ఎవరూ ఇబ్బంది పడటం లేదట. ఎందుకంటే ఈ జంట నగ్నంగా వర్కవుట్ చేయడానికి ఒక ప్రైవేట్ జిమ్‌ను ఎంచుకుంది. నిర్వాహకులకు డబ్బులు చెల్లించి మరీ ఎవరూ లేకుండా తాము మాత్రమే వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకొని ఈ పనిచేస్తోంది. ఇలా చేయడంవల్ల తమకు సంతోషంగా ఉందని, ఫిట్‌నెస్‌తో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటోందని మాంటోవానీ, వాగ్నర్ ఓ జంట పేర్కొంటున్నది. ప్రైవసీకి ప్రాబ్లమ్ లేకుండా ఇతర జంటలు కూడా ఇలా ట్రై చేయవచ్చని సలహా ఇస్తున్నారు ఈ దంపతులు. అంతేకాకుండా వీరు ప్రతిరోజూ నగ్నంగా చేసిన వర్కవుట్స్‌కు సంబంధించినర ఫొటోలు, వీడియోలు ఓన్లీ ఫ్యాన్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేస్తూ ఫాలోవర్లను కూడా పెంచుకుంటున్నారు.





Source link

Related posts

షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇంజెక్షన్ కి బదులు ఇన్సులిన్ చాక్లెట్ ? ఎలా పని చేస్తుందో తెలుసా

Oknews

టీ తాగడం వల్ల మగవారికి ఆ సమస్య వస్తుందని తెలుసా?

Oknews

మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారా.. ఈ రెసిపీస్ మీ కోసమే..

Oknews

Leave a Comment