Health Care

జుట్టు అందంగా, పొడవుగా పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి


దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ పొడవుగా, ఒత్తుగా, అందంగా ఉండే జుట్టును కోరుకుంటారు. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా తమ జుట్టు సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దీని కోసం ఎన్నో ఖరీదైన ప్రాడక్టులను ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తుల తయారీలో చాలా హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. కెమికల్ షాంపూలు, నూనెలను ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో జుట్టును జాగ్రత్తగా చూసుకుంటే జుట్టు చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

మీ జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు, సహజ నివారణలతో పొడవాటి జుట్టును పొందవచ్చు. ఈ సహజ మూలికలు జుట్టు పెరుగుదలను పెంచుతాయి. అలాగే జుట్టును బలోపేతం చేస్తాయి. ఇంతకీ ఆ నాచురల్ మూలికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఉసిరి

ఆయుర్వేదంలో ఉసిరి జుట్టు పెరుగుదలకు, ధ‌ృఢత్వానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మీ ఆహారంలో ఉసిరి లేదా ఉసిరి రసాన్ని చేర్చుకోవచ్చు. దీనితో పాటు జుట్టుకు ఆమ్లా పేస్ట్‌ను కూడా అప్లై చేయవచ్చు.

2. భృంగరాజ్

బృంగరాజ్ అన్ని మూలికలకు రాజు అని పిలుస్తారు. ఇది జుట్టుకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించడంలో ప్రభావవంతంగా పరిచేస్తుంది. బృంగరాజ్ నూనెతో జుట్టు పెరుగుదలను రెట్టింపు చేయవచ్చు. దీనితో పాటు జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. స్కాల్ప్ కు పోషణ అందించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

3. మెంతికూర

మెంతులు ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ లకు మూలంగా పరిగణిస్తారు. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. మీ ఆహారంలో మెంతికూరను చేర్చుకోవడం ద్వారా, మీరు మీ జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. జుట్టు కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు. దీని కోసం, మీరు వారానికి ఒకసారి మీ జుట్టుకు మెంతులు పేస్ట్ చేయాలి.

4.వేప

వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శిరోజాలను మెరుగుపరుస్తాయి. దీనితో పాటు, వేపను ఉపయోగించడం ద్వారా చుండ్రు వల్ల వచ్చే దురదను కూడా తగ్గించవచ్చు.



Source link

Related posts

కామికా ఏకాదశి.. ఆ రోజున ఈ అద్భుతమైన యోగం ఏర్పడనుంది

Oknews

ఈ నూనెలతో కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు!

Oknews

పెదాలు నల్లగా మారుతున్నాయా.. ఈ నూనెను రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయట..

Oknews

Leave a Comment