అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 : ది రూల్’. 2021 డిసెంబర్ లో విడుదలై సంచలనం సృష్టించిన ‘పుష్ప: ది రైజ్’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడంతో ‘పుష్ప-2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 110 మిలియన్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న ‘పుష్ప-2’ టీజర్.. ఏడేళ్లుగా ‘జై లవ కుశ’ పేరు మీదున్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది.
ఒకప్పుడు సినిమా వసూళ్ల రికార్డులను మాత్రమే పట్టించుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో టీజర్, ట్రైలర్ రికార్డులను కూడా పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ మూవీ టీజర్ యూట్యూబ్ లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఏకంగా 137 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ఏడేళ్ల తర్వాత ‘పుష్ప-2’ బ్రేక్ చేసింది. ‘పుష్ప-2’ టీజర్ 138 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయింది. ‘పుష్ప-2’, ‘జై లవ కుశ’ తర్వాతి స్థానాల్లో.. 134 గంటలతో ‘జనతా గ్యారేజ్’, 123 గంటలతో ‘సరిలేరు నీకెవ్వరు’, 120 గంటలతో ‘కాటమరాయుడు’, ‘రంగస్థలం’, ‘అరవింద సమేత’ ఉన్నాయి.