EntertainmentLatest News

టాప్‌ హీరోల మోస్ట్‌ వాంటెడ్‌ సిల్వర్‌ జూబ్లీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!


కృషి, పట్టుదల, అంకిత భావం ఉంటే ఏ రంగంలోనైనా రాణించే అవకాశం ఉంటుంది. దానికి వయసుతో సంబంధం లేదు. ఎన్నో సంవత్సరాలు ఒక రంగంలో ఉండి కృషి చేసినా రాని సక్సెస్‌ చిన్న వయసులోనే సాధించి సంచలనం సృష్టించిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో అలాంటి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. చిన్న వయసులోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన ఏకైక తెలుగువాడు దేవిశ్రీప్రసాద్‌. 19 సంవత్సరాల వయసులోనే యం.యస్‌.రాజు, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవి’ చిత్రానికి సంగీతం అందించడం ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 12, 1999లో విడుదలైంది ‘దేవి’ చిత్రం. ఈరోజుతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు దేవిశ్రీప్రసాద్‌.

అలా కలిసొచ్చింది.. పేరులోనే మొదటి సినిమా పేరు!

‘దేవి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన నాటికి ఇండస్ట్రీలో ఎవరికీ దేవిశ్రీప్రసాద్‌ అనేవాడు తెలీదు. తండ్రి జి.సత్యమూర్తి. ప్రముఖ సినీ రచయిత. టాలీవుడ్‌లోని ఎంతో మంది ప్రముఖ హీరోల సినిమాలకు కథ, మాటలు అందించారు. దేవి పూర్వీకులు సంగీత జ్ఞానం ఉన్నవారే కావడంతో అతనికి కూడా సంగీతం అంటే అభిలాష ఏర్పడిరది. దీంతో ఎప్పటికైనా తను మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవ్వాలని చిన్నప్పటి నుంచే కలలు కనడం మొదలుపెట్టాడు. కలిసొచ్చే కాలానికి అవకాశాలు నడిచొస్తాయి అన్నట్టు.. దేవిశ్రీప్రసాద్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేసే అవకాశం నిజంగానే నడిచొచ్చింది. 1999లో యం.యస్‌.రాజు అంతా కొత్తవారితో దైవభక్తితో కూడిన సినిమా చెయ్యాలనుకున్నారు. దానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇళయరాజాను అనుకున్నారు. ఆయన్ని కలిసేందుకు వెళితే బిజీగా ఉన్నారని తెలిసింది. పక్కనే ఉన్న సత్యమూర్తి ఇంటికి వెళ్ళారు యం.యస్‌.రాజు. అక్కడే ఉన్న దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడం చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు. అలా ‘దేవి’ చిత్రంతో 19 సంవత్సరాల వయసులో సంగీత దర్శకుడయ్యాడు దేవి. ఈ సినిమా చేయడం వల్ల అతనికి దేవిశ్రీప్రసాద్‌ అనే పేరు వచ్చిందని అందరూ అనుకుంటారు. దేవిశ్రీప్రసాద్‌ అమ్మమ్మ పేరు దేవి మీనాక్షి, తాత పేరు ప్రసాదరావు. ఈ ఇద్దరి పేర్లు కలిపి దేవిశ్రీప్రసాద్‌ అనే పేరు పెట్టారు సత్యమూర్తి. 

ఉవ్వెత్తున లేచిన సంగీత కెరటం..!

మొదటి సినిమా ‘దేవి’కి ఇచ్చిన మ్యూజిక్‌ ఎంతో పాపులర్‌ అయింది. అందరి దృష్టీ దేవిశ్రీప్రసాద్‌ మీద పడిరది. అతని మ్యూజిక్‌కి ఎంతో ఇంప్రెస్‌ అయిన కోడి రామకృష్ణ తన నెక్స్‌ట్‌ మూవీ నవ్వుతూ బ్రతకాలిరా చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చారు. అప్పటివరకు అందరూ విన్న సంగీతాన్ని కొత్తగా ప్రజెంట్‌ చేసేందుకు దేవి ఎంతో కృషి చేశాడు. ఒకసారి సినిమా చేసిన వారు అంత త్వరగా అతన్ని వదులుకోలేరు. ఆయా దర్శకనిర్మాతలతో అంత మంచి బాండిరగ్‌ ఏర్పరుచుకుంటాడు దేవి. అందుకే శ్రీను వైట్ల, త్రివిక్రమ్‌, యం.యస్‌.రాజు, తమిళ్‌ డైరెక్టర్‌ హరి వంటి వారు తమ సినిమాకి దేవితోనే మ్యూజిక్‌ చేయించుకుంటారు. ఇక దర్శకుడు సుకుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూపొందించిన సినిమాలన్నింటికీ దేవిశ్రీప్రసాదే మ్యూజిక్‌ అందించడం విశేషమనే చెప్పాలి. 

హీరోలకు ఊపు తెచ్చే పాటలు.. స్టెప్పులేయించే పాటలు!

టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ దేవి పనిచేశాడు. వారికి సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఇవ్వడానికి హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టేవాడు. ముఖ్యంగా అతని పాటల్లోని రిథమ్‌, ఫాస్ట్‌బీట్‌ పాటలు ఆయా హీరోలు స్టెప్స్‌ వేసేందుకు అనుకూలంగా ఉంటాయి. అందుకే దేవితోనే మ్యూజిక్‌ చేయించుకునేందుకు ఆసక్తి చూపేవారు. కొన్ని సందర్భాల్లో ఆ పాటల్లోని కొన్ని లిరిక్స్‌ని కూడా దేవి సజెస్ట్‌ చేసేవాడు. దాంతో పాటలకు కొత్త అందం వచ్చేది. ముఖ్యంగా అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి హీరోలకు అద్భుతమైన స్టెప్స్‌ వేసే అవకాశం దేవి మ్యూజిక్‌ వల్లే వచ్చేది. తెలుగులోనే కాదు, తమిళ్‌ హీరోలు కూడా దేవితో మ్యూజిక్‌ చేయించుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. దేవిశ్రీప్రసాద్‌ వయసు 44 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ బ్యాచ్‌లర్‌ లైఫ్‌నే ఎంజాయ్‌ చేస్తున్నాడు. దేవి తన కెరీర్‌లో ఇప్పటివరకు 110 సినిమాలకు సంగీతం అందించాడు. అందులో 22 తమిళ సినిమాలు, ఒక కన్నడ సినిమా కూడా ఉంది. ప్రస్తుతం దేవి చేస్తున్న సినిమాలు, పుష్ప2, తాండేల్‌, కంగువ, కుబేర, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. 



Source link

Related posts

మాస్ గాడ్ బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్!

Oknews

రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య.. 12 ఏళ్ళుగా సహజీవనం! 

Oknews

విలన్‌ హీరో అయ్యాడు.. ‘అహో విక్రమార్క’గా ఆగస్ట్‌ 30న వస్తున్నాడు!

Oknews

Leave a Comment