ప్రభాస్ ఫ్యాన్స్ ఏం క్రేజీ ఉన్నారు భయ్యా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటుంటే ఏమిటో అనుకున్నాం.. ఈరోజు గురువారం జూన్ 27 న విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్ర థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేసారో అనేది జస్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. క్రాకర్స్ కాల్చడం కాదు.. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ అంటూ గోల గోల చేస్తున్నారు.
మిడ్ నైట్ షోస్ లేవనే డిజ్ పాయింట్ తప్ప తెల్లవారు ఝామున 4 గంటల షోస్ కి అభిమానులే కాదు కామ్ ఆడియన్స్ ని కూడా మత్తు వదిలించి థియేటర్స్ కి రప్పించింది కల్కి. ఈ చిత్రాన్ని చూసేందుకు హుషారుగా థియేటర్స్ లో అడుగుపెట్టి సినిమా పూర్తికాగానే.. బయటికొచ్చి పబ్లిక్ టాక్ అంటూ హంగామా సృష్టిస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ అయితే Tollywood ledhu Bollywood ledhu REBELwood anthe, టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు అంతా రెబల్ వుడ్ అంటూ రెచ్చిపోతున్నారు. 2000 కోట్లు క్రాస్ చెయ్యడం పక్కా.. ఏముంది రా సినిమా హాలీవుడ్ రేంజ్ మూవీ కల్కి, వరల్డ్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతుంటే.. కామన్ ఆడియన్స్ కి కూడా ఎప్పుడెప్పుడు కల్కిని థియేటర్స్ లో చూసెయ్యాలనే ఆసక్తి స్టార్ట్ అయ్యింది. మరి కల్కి ఎలా ఉందొ అనేది కాసేపట్లో Cinejosh రివ్యూలో చూసేద్దాం..