EntertainmentLatest News

టిల్లు అన్న ఊరమాస్ బ్యాటింగ్.. ఆ స్టార్ హీరోల రికార్డులకు ఎసరు!


ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీస్తే.. యంగ్ హీరో సినిమాకి కూడా స్టార్ హీరో సినిమా రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) రుజువు చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు మామూలుగా లేదు. కేవలం ఐదు రోజుల్లోనే రూ.85 కోట్ల గ్రాస్ రాబట్టిన ‘టిల్లు స్క్వేర్’.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇది సూపర్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా రూపొందింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. మార్చి 29న విడుదలై, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.23.7 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.21.6 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.22.8 కోట్ల గ్రాస్ రాబట్టిన ‘టిల్లు స్క్వేర్’.. మొదటి వీకెండ్ లోనే ఏకంగా రూ.68.1 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇక నాలుగురోజు సోమవారం అయినప్పటికీ రూ.9.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. మండే టెస్ట్ పాస్ అయింది. అలాగే ఐదో రోజు కూడా రూ.7 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో ఐదు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ సాధించింది. 

ప్రస్తుతం సమ్మర్ సీజన్.. దానికి తోడు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ‘టిల్లు స్క్వేర్’ చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇదే జోరు మరికొద్ది రోజులు కొనసాగితే.. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది. అదే జరిగితే విజయ్ దేవరకొండ, నాని వంటి యంగ్ స్టార్ల రికార్డులు కూడా లేచిపోతాయి.

యంగ్ స్టార్స్ లో ‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండ, ‘దసరా’తో నాని.. వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరారు. ‘గీత గోవిందం’ రూ.130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. ‘దసరా’ రూ.120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆయా హీరోల కెరీర్లో ఇవే హైయెస్ట్ కలెక్షన్స్. అయితే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’తో సిద్ధు.. వారి హైయెస్ట్ కలెక్షన్స్ ని బీట్ చేసేలా ఉన్నాడు.



Source link

Related posts

నేను చనిపోయానని అనుకున్నారు..

Oknews

ఉప్పెన లో శ్రీదేవి కూతురు ఉందా.. బోనీ కపూర్ చెప్తున్నాడు

Oknews

Mokshagna Warning To His Father Balakrishna మోక్షజ్ఞ నిజంగా అంతమాటన్నాడా?

Oknews

Leave a Comment