GossipsLatest News

టిల్లు థియేటర్స్ లో అఫీషియల్ గా చెప్పేసారు



Sun 31st Mar 2024 12:16 PM

tillu cube  టిల్లు థియేటర్స్ లో అఫీషియల్ గా చెప్పేసారు


Tillu cube announced Tillu square theater టిల్లు థియేటర్స్ లో అఫీషియల్ గా చెప్పేసారు

డీజే టిల్లు మోత టిల్లు స్క్వేర్ వరకు కంటిన్యూ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ మరోసారి ర్యాంపాడించాడు. డీజే టిల్లు లో నేహా శెట్టితో రొమాన్స్ చేసిన సిద్దు టిల్లు స్క్వేర్ లో అనుపమతో రొమాన్స్ చేసాడు. అంతేకాకుండా సిద్దు జొన్నలగడ్డ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ యూత్ కి బాగా ఎక్కేస్తూ.. అందరూ టిల్లు భజన చేసేలా చేస్తుంది. ఈ వారం టిల్లు  కి మరో సినిమా పోటీ లేకుండా పోవడం నిర్మాతలకి ప్లస్ అయ్యింది. పృథ్వీ రాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ తెలుగులోనూ విడుదలైనా.. ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఓటెయ్యడం లేదు. 

మరోపక్క టిల్లు స్క్వేర్ మౌత్ టాక్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యింది. దానితో వసూళ్లు కుమ్మేస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని టిల్లు స్క్వేర్ విడుదలైన రోజున థియర్స్ లో కనిపించలేదు. సినిమాకి వచ్చిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి నిర్మాత నాగవంశీ టిల్లు క్యూబ్ ని సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అనౌన్స్ చేసారు. 

అయితే టిల్లు విడుదలైన రెండోరోజు వచ్చేసరికి టిల్లు క్యూబ్ అంటూ టిల్లు స్క్వేర్ థియేటర్స్ లోనే యాడ్ చేసారు. టిల్లు స్క్వేర్ ఫినిష్ అవ్వగానే.. కంటిన్యూ గా టిల్లు క్యూబ్ అంటూ అఫీషియల్ గా థియేటర్స్ లో అనౌన్స్ చేసారు. నాగవంశీ వట్టి మాటలు కాదు.. గట్టిగానే ప్లాన్ చేసి టిల్లు స్క్వేర్ థియేటర్స్ లోనే టిల్లు 3 కమింగ్ సూన్ అంటూ ప్రకటించేశారని అంటున్నారు. మరి టిల్లు 3 ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది కొద్దిరోజులు ఓపిక పడితే తెలిసిపోతుంది. 


Tillu cube announced Tillu square theater:

Tillu Cube Sequel To Tillu Square Announced









Source link

Related posts

దాండియా ఆడేందుకు హిందువులకే అనుమతి.!

Oknews

విలేజ్ ని దత్తత తీసుకున్న కల్కి దీపికా పదుకునే.. షాక్ అవుతున్న నెటిజన్స్

Oknews

‘పాయుమ్ ఒలిని ఎనక్కు’ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment