ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ (TSRTC PRC)ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి వస్తుందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల అదనపు భారం పడనుంది. పీఆర్సీ ప్రకటనతో 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. 2017లో అప్పటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ సిబ్బందికి 16 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ(PRC) ప్రకటించింది. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీపై ప్రకటన లేదు. ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల తెలిపారు. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నూతన పీఆర్సీ ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు(Pay Scale) అమలు చేయనున్నారు. ఈ పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వ ఖజానాపై ఏటా 418.11 కోట్ల అదనపు భారం పడనుంది.
Source link