Telangana

టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లు విడుదలకు హామీ-hyderabad news in telugu cm revanth reddy started 100 new tsrtc buses promised release pending payment ,తెలంగాణ న్యూస్



పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లు విడుదలకొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ 100 బస్సుల్లో…..90 ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయని, ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడతాయన్నారు. అలాగే శ్రీశైలం ఘాట్‌ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్‌ బకాయిలు రూ.280 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా 2200 కొత్త బస్సులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రిని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ప్రతి ఆర్టీసీ బస్సు నిండుగా తిరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాలక్ష్మి అమలుకయ్యే నిధులను ఎప్పటికప్పడు టీఎస్‌ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.



Source link

Related posts

Telangana SSC exams 2024 will be held from March 18 Over 5 lakh students to appear

Oknews

కన్నారం గ్రామం ఏ మండలంలోకి? ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత-hanamkonda news in telugu kannaram village plebiscite conduction tensioned ,తెలంగాణ న్యూస్

Oknews

Authorities seized 3.5 Tonnes of Fake Ginger Garlic Paste in Hyderabad | Fake Ginger Garlic Paste: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారుచేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

Oknews

Leave a Comment