టెట్ పరీక్ష విధానంటెట్ పేపర్-1 కు డీఈడీ(D.Ed) అర్హతతోపాటు జనరల్ అభ్యర్థులు ఇంటర్ 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు డీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. టెట్ పేపర్-2కు డిగ్రీ అర్హతతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు పొంది ఉండాలి. టీఎస్ టెట్(TS TET 2024) లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1ను ఉదయం 9 నుంచి 11.30 వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహిస్తారు. టెట్ కు డీఎస్సీ(TS DSC 2024)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. జనరల్ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టెట్ లో అర్హత పొందవచ్చు.
Source link