గోదావరి జిల్లాల పల్లెటూళ్లలో కుర్రాళ ఎకసెక్కాలు, వెటకారాలు, అల్లర్లు మామూలుగా వుండవు. తెలంగాణ ‘జాతిరత్నాలు’ ఆంధ్రలో కనిపించేది ఈ గోదావరి జిల్లాల్లోనే. అందుకే అలాంటి స్క్రిప్ట్ తీసుకుని చేసిన సినిమా ఆయ్!.
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ముగ్గురు కుర్రాళ్ల అల్లర్లు, ఆకతాయి చేష్టలు పెరిగి పెద్దయిన తరువాత కూడా కొనసాగితే ఎక్కడో అక్కడ చిన్న ట్విస్ట్ పడుతుంది. ఆయ్ సినిమా ట్రయిలర్ చూస్తుంటే ఇదే కనిపించింది. కానీ ఈ సింపుల్ పాయింట్ మధ్య బోలెడంత కథ వుంది. కథతో పాటు అల్లరీ వుంది అనిపించేలా కట్ చేసారు ట్రయిలర్ ను.
ఏ ప్రేమకు అయినా అడ్డంకు పడేవి డబ్బు, కులమే ప్రధానం. ఆయ్ సినిమాలో కూడా ‘మీరేమిట్లు’ ‘మనోడేనా’ అన్న మాటలు రెండు మూడు సార్లు వినిపించాయి. తేడా వస్తే ఒక్కోడికి ‘ఉప్పెన’యిపోతుంది అనడం కూడా సినిమాలో వున్న లవ్ స్టోరీ ని వెల్లడించింది.
కొత్త పాత కలయికలో రూపొందించిన చిత్రం ఇది. ఎన్టీఆర్ బావపరిది నితిన్ సంగతి ఎలా వున్నా, మిగిలిన వారంతా చెరో చెయ్యి పట్టుకుని లాగించేసినట్లు అనిపించింది. అజయ్ సంగీతం టీజర్ కంటెంట్ కు తగినట్లు సరదాగా వుంది. అంజి దర్శకత్వం ఓకె.. ఎక్కడా మరీ కొత్త సీన్ అనిపించేవి లేవు కానీ, అందించిన సీన్లు అయితే అమెచ్యూర్ గా లేవు. అదే కీలకం. అల్లు అరవింద్ సమర్పకుడు. బన్నీ వాస్ నిర్మాత.
The post ట్రయిలర్ బాగుందండీ.. ఆయ్! appeared first on Great Andhra.