Health Care

ట్రిప్‌కు వెళ్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేయకండి!


దిశ, ఫీచర్స్: ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఉండే కష్టాలు, బాధలు, టెన్షన్ల నుంచి ఉపశమనం పొందేందుకు ట్రిప్ వెళ్లడం సాధారణంగా మారింది. ఉద్యోగం, ఫ్యామిలీ, టెన్షన్లు వీటన్నింటినీ పక్కన బెట్టి రెండ్రోజులు చిల్ అవ్వడానికి కొందరు గోవా, వైజాగ్ అంటూ బీచ్ ఉన్న ప్రాంతాలకు వెళ్తారు. మరి కొందరైతే మానసిక ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తుంటారు. అయితే, ఇలా ట్రిప్‌కు వెళ్లే సమయంలో కొందరు ఫుల్ ప్రిపేరై అన్ని పకడ్బంధీగా ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు తొందరలో చేసే ప్లాన్స్ వల్ల అనేక సమస్యలు రావడంతో ట్రిప్‌కు వెళ్లిన తృప్తి కూడా ఉండదు. అలాంటి వాటిలో ముఖ్యంగా డబ్బు ముందు వరుసలో ఉంటుంది. అందుకే ట్రిప్‌కు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి తెలుసుకుందాం.

ట్రావెలింగ్‌లో అసలు ప్రాబ్లమ్ వచ్చేదిక్కడే:

టూర్‌కు వెళ్లినప్పుడు ఖర్చు ప్రాబ్లమ్ అందరికీ వస్తుంటుంది. వెళ్లే ముందు చేసుకున్న ప్లాన్స్ అన్నీ అక్కడకు వెళ్లాక బెడిసికొడుతుంటాయి. ముఖ్యంగా షాపింగ్‌ అండ్ ఫుడ్‌కు సంబంధించిన విషయాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముందుగా నిర్ణయించిన బడ్జెట్‌కు కట్టుబడి ఉండకపోవడం మూలంగానే తప్పులు జరుగుతుంటాయి. ఈ రెండింటిని ఎంత అదుపులో ఉంచితే అంత మంచిది. ముఖ్యంగా తీసుకెళ్లిన డబ్బులు అయిపోయినా.. ప్లాన్ చేసుకున్న దానికంటే ఎక్కువ అవుతున్నా ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వంటివి బయటకు తీయొద్దు. వాటి వల్ల ఉన్న ప్రాబ్లమ్స్‌తో పాటు రోజూ వారి జీవితంలో మరికొన్ని ఉత్పన్నమవుతుంటాయి. టెక్నాలజీ విషయానికి వస్తే ఎప్పుడు ఎలాంటి ఆటంకం కలుగుతుందో తెలియదు. అందుకే క్రెడిట్ కార్డుల స్వైపింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్‌ను బట్టి నడుచుకోవడం నేర్చుకుంటే ట్రిప్ ఆనందంతోపాటు, చాలా జ్ఞాపకాలను ఇస్తుంది.

తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త:

ఎవరైనా టూర్లు, ట్రిప్‌లు అంటే ఒక మన చుట్టూ పక్కన ఉన్న టూరిజం ప్రాంతాలతో పాటు కేరళ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. విదేశాలకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువే ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళినప్పుడు సెల్‌ఫోన్లను జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇండియాతో పోలిస్తే అక్కడ ఎక్కువ చార్జెస్ పడుతాయి. ముందు అక్కడ వర్తించే నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లాన్‌ను చెక్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంటేలా చూసుకోవాలి. ఇక మనీ ఎక్ఛేంజ్ విషయానికి వస్తే ఎయిర్‌పోర్ట్ కియోస్క్‌లలో మారకం ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత స్థానిక నగదు పొందడానికి గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే బ్యాంక్ ఏటీఎంకి వెళ్లడం బెటర్. అలాగే అవసరాన్ని బట్టి మాత్రమే మనీ విత్ విత్ డ్రా చేసుకోవడం బెటర్.

టావెల్ ఇన్సూరెన్స్ మస్ట్ :

ప్రస్తుత రోజుల్లో ఎవరి జీవితానికి కూడా గ్యారంటీ లేదు. కరోనా వైరల్ సృష్టించిన విధ్వంసం కారణంగా ఎప్పుడు ఏ వైరల్ ఎక్కడి నుంచి దూసుకొస్తుందో.. ఎప్పుడు అనారోగ్యం బారిన పడుతామో తెలియని పరిస్థితి నెలకొంది. టూర్‌కు వెళ్లినప్పుడు ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే అందరూ జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం బెటర్. దీని వల్ల అత్యవసర సమయాల్లో మనీ సేవ్ అవుతుంది. మరో విషయం.. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు సాధారణంగా చెల్లించాల్సిన బిల్లులను అనివార్య కారణాలవల్లనో, సమయం లేకనో పెండింగ్‌ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఇంట్రెస్ట్ లేదా అదనపు చార్జెస్ పడుతుంటాయి. అందుకే కొన్నివారాలపాటు ట్రావెల్ చేయాల్సి వస్తే, అంతకు ముందు పెండింగ్ బిల్లలును క్లియర్ చేయండి. అప్పుడే టెన్షన్లు మాని ఎంజాయ్ చేయడం ప్రారంభించగలం.

పరిస్థితి ఇలా ఉంటే ట్రిప్‌కు ప్లాన్ చేయకండి:

విహార యాత్రల్లో ప్రధాన భూమిక పోషించేది డబ్బు. అందుకే మనీకి భయపడి అందరూ తరచూ ట్రిప్స్‌కు వెళ్లడం లాంటివి చేయరు. కొందరు డబ్బు వృథా చేయడం ఎందుకని ఆలోచించగా.. మరికొందరు బద్దకం మూలంగా లైట్ తీసుకుంటారు. అందుకే సరిపడా డబ్బు ఉంటేనే ప్లాన్ చేసుకోవడం మంచిది. అనవసరంగా టీ, కాఫీలు, స్నాక్స్, షాపింగ్ అంటూ ఖర్చు పెడుతుంటే.. మీరు ఇబ్బందిగా ఫీలవుతారు. కాబట్టి మీకు వీలైనప్పుడు, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే ట్రావెల్ చేయడం బెటర్. మరికొందరు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాక అక్కడి ధరలు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఖర్చు‌లు తెలియకపోతే అవస్థలు పడుతుంటారు. వెళ్లబోయే సిటీకి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ ఆప్షన్ గురించి ముందుగానే సెర్చ్ చేసి తెలుసుకోవడంవల్ల ఇటువంటి ఇబ్బందులను నివారించవచ్చు. అందుకే పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది



Source link

Related posts

రాత్రికి రాత్రే అందంతో అద్భుతం చేయాలా.. ఇలా చేయండి!

Oknews

వీటిని అసలు మీ ముఖంపై అప్లై చేయోద్దు.. ఎందుకంటే..?

Oknews

అర్ధరాత్రి కాగానే గ్రహాంతర వాసుల నుంచి మెసేజ్!.. వాళ్లంతా ఒక్కసారిగా లేచి..

Oknews

Leave a Comment