Entertainment

ట్రైలర్ తో ప్రపంచ రికార్డు సృష్టించిన సినిమా 


భాషతో సంబంధం లేకుండా సినిమాని ప్రేమించే వాళ్ళకి మార్వెల్ స్టూడియోస్  ఉన్న గొప్పతనం గురించి తెలుస్తుంది. ఎన్నో గొప్ప సినిమాలు ఆ సంస్థ నుండి వచ్చి ప్రపంచ సినీ ప్రేమికులని అలరించాయి. ఇప్పుడు ఆ సంస్థ ద్వారా లేటెస్ట్ గా రాబోతున్న మూవీ  డెడ్ పూల్ అండ్ వోల్వరైన్. తాజాగా ఈ సినిమా వరల్డ్ రికార్డు సెట్ చేసింది.

మార్వెల్ స్టూడియోస్ వారి నయా మూవీ డెడ్ పూల్ అండ్ వోల్వరైన్. రెండు రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు ప్రపంచ సినీ చరిత్రలో కనివినీఎరుగని విధంగా 365 మిలియన్ ల మంది డెడ్ పూల్ ని వీక్షించారు.కేవలం ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే అంత మంది వ్యూయర్స్  ఒక మూవీ ట్రైలర్ ని చూడటం  ప్రపంచంలోనే మొట్టమొదటి సారి.దీంతో విశ్వ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో  డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

 మార్వెల్ స్టూడియోస్ లోనే గతంలో వచ్చిన  డెడ్ ఫుల్ సిరీస్ రెండు పార్ట్ లు ఎంత పెద్ద విజయాలు సాధించాయో  అందరికి తెలిసిందే. యాక్షన్ అండ్ కామెడీ ప్రధానంగా వచ్చిన  ఆ రెండు సిరీస్ లు కూడా ప్రేక్షకులని నవ్వులతో ముంచెత్తాయి. ఇప్పుడు వాటిని మించిన కామెడీతో డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ రాబోతుంది. ఈ చిత్రంలో  హీరోలుగా  రేయాన్ రొనాల్డ్స్, హ్యూ జాక్ మాన్ లు  నటించారు. మార్వెల్ స్టూడియోస్  గత చిత్రమైన  స్పైడర్ మ్యాన్ నో వే హోమ్  ట్రైలర్ 355.5 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.

 



Source link

Related posts

రెండో సినిమాకే ధనుష్‌కి దక్కిన అరుదైన గౌరవం.. ‘రాయన్‌’ చిత్రాన్ని గుర్తించిన ఆస్కార్‌!

Oknews

ప్రశాంత్ నీల్ అభిమాన దర్శకుడు తెలుగు నటుడు కూడా 

Oknews

ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్‌ సాధించిన ‘గామి’!

Oknews

Leave a Comment