ByGanesh
Fri 27th Oct 2023 10:06 AM
బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ బ్యాచ్ లా ప్రోజెక్ట్ అయిన.. శోభా శెట్టి, ప్రియాంక, అమరదీప్ వీళ్లంతా ఓ గ్రూప్ లా ఫామ్ అయ్యి మిగతా వారిని ఓ ఆట ఆడుకోవడం ఒక ఎత్తు, శోభా శెట్టి, ప్రియాంక సీరియల్ పైత్యాన్ని చుపిస్తూ నోరేసుకుని పడిపోవడం మరో ఎత్తు. శోభా శెట్టి టాస్క్ పరంగా అబ్బాయిలతో పోటీ పడుతుంది. టాస్క్ విషయంలో ఆమె ఓ రాక్షసిలా ఆడుతుంది. ప్రియాంక కూడా అంతే. కానీ వీళ్ళు నోరు విప్పితే ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వరు. భోలే విషయంలో ఇదే జరిగింది. ఇక శివాజీ అయితే శోభా శెట్టి ని హౌస్ నుంచి ఎలాగైనా పంపెయ్యాలని చూస్తున్నాడు.
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ గా శోభ శెట్టి చివరి రౌండ్ వరకు పోరాడింది. ఫైనల్ గా ఆమె కెప్టెన్ అయ్యింది లేనిది అలా ఉచితే గత రెండు రోజులుగా శోభా శెట్టి సోషల్ మీడియా ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతుంది. ఆమెని కొంతమంది సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ వేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఆమెని తిడుతున్నారు. ఆమె నోరు విప్పితే బాబోయ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైల్డ్ కార్డు కంటెస్టెంట్ భోలే అయితే నువ్వు కార్తీక దీపం మోనితవి.. శోభా శెట్టి వి కాదు అంటూ కామెంట్స్ కూడా చేసాడు.
ఆమెని కొంతమంది పొగుడుతూ.. కొంతమంది తిడుతూ సోషల్ మీడియా ట్విట్టర్ లో ఈ విధమైన ట్వీట్స్ వేస్తున్నారు. #ShobhaShetty కనుక సీజన్ 7 టైటిల్ గెలుచుకునేటట్లైతే, హైదరాబాద్ GHMC బోర్డుకి అలాగే టెలివిజన్ ప్రసారాల రెగులేషన్ బోర్డుకి ముందుస్తు సమాచారాం ఇచ్చి, అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంత నివాసితులను, టీవికి దగ్గర్లో ఉన్న చిన్న పిల్లలను ఖాళీ చేయించి సౌండ్ pollution బారిన పడకుండా కాపాడాలని మా విన్నపం.. అంటూ #ShobhaShetty హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
Bigg Boss Monita is trending on Twitter:
Shobha Shetty hashtag trends on twitter