Entertainment

డబ్బు కోసం తప్పు పని చెయ్యాల్సిన అవసరం లేదు..సిఎం కొడుకైతే ఏంటి


దయ చేసి నా జీవితాన్ని నాశనం చెయ్యకండి. నాతో పాటు నా కుటుంబం ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది.16 సంవత్సరాల వయసు నుండే నేను ఆర్ధికంగా స్వతంత్రంగానే  ఉన్నాను.సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఎవర్ని అడగని దానిని.ఈ మాటలన్నీ అంటుంది ఎవరో కాదు ఒక ఫేమస్ హీరోయిన్. ఎందుకు తను అలా చెప్పాల్సొచ్చింది.అసలు ఆ హీరోయిన్ ఎవరు? 

నివేత పేతు రాజ్.తమిళనాడుకి చెందిన ఈమె  మెంటల్ మదిలో అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఇటీవల చెన్నై లో భారీ ఎత్తున కార్ రేస్ పోటీలు జరిగాయి.ఇందులో నివేత కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ పోటీలని నివేత కోసం ప్రముఖ హీరో తమిళనాడు సిఎం కొడుకైన  ఉదయనిది ఏర్పాటు చేసాడనే రూమర్లు గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాయి. పైగా ఆమె కోసం ఏమైనా చెయ్యడానికి రెడీ గా ఉన్నాడని విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో నివేత తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. ఉదయనిది కి నాకు మధ్య ఏదో ఉందనే   తప్పుడు వార్తలని కొంత మంది జర్నలిస్ట్ లు ప్రచారం చేస్తున్నారు. అలాగే  నా కోసం డబ్బులు ఖర్చుచేస్తున్నాడని కూడా అంటున్నారు. అవన్నీ పూర్తిగా  అబద్ధం. నేను 2013 నుంచి కారు రేసింగ్ నేర్చుకుంటున్నాను. అలాగే చెన్నై లో కార్ రేస్ లు నిర్వహిస్తారని కూడా  తెలియదు. తప్పుడు వార్తలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారని ఆలోచించాలని చెప్పింది. తన ట్విట్టర్ ద్వారా ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

అలాగే మాది చాలా సంప్రదాయమైన కుటుంబం.  2002 నుంచి దుబాయ్ లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. జీవితంలో ఎన్నో  కష్టాలని ఎదుర్కొని ప్రస్తుతం ఒక మంచి స్థానంలో ఉన్నానని కూడా చెప్పింది. అలాగే రూమర్స్ విషయంలో తనకి  అండగా ఉన్న కొంత మంది జర్నలిస్ట్ లు కి  కూడా ధన్యవాదాలు తెలిపింది .2017 లో నివేత, ఉదయనిధి లు ఒక తమిళ మూవీలో  హీరో హీరోయిన్లు గా చేసారు. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్, అలవైకుంఠపురం లాంటి సినిమాలు ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. 



Source link

Related posts

జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు!

Oknews

డైరెక్టర్ అన్వేషణలో చిరంజీవి.. విశ్వంభర రిజల్ట్ తో సంబంధం లేదు

Oknews

అగస్ట్ 15 న  పదిహేను సినిమాలు  విడుదల 

Oknews

Leave a Comment