దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో ఆహారం విషయంలో, జీవనశైలి మారడం వల్ల వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కొందరు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇందులో ముఖ్యంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. దీని కారణంగా కొన్ని ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉంటారు. అయితే కచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తేనే ఈ వ్యాధి అదుపులోకి వస్తుంది.
ఈ వ్యాధి కొందరిలో వంశపారంపర్యంగా వస్తే.. ఇంకొందరిలో జీవనశైలి అదుపు తప్పడం వల్ల ఏర్పడుతుంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు బయటపడేవి. కానీ, ఇప్పుడు యుక్తవయస్సులో ఉన్నవారికి సైతం ఈ వ్యాధి ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే శరీరానికి తగిన వ్యాయామం, సమతుల్య ఆహారాన్ని తీసుకుని జాగ్రత్త పడాలి. అయితే డయాబెటిస్ రాకుండా ఉండాలంటే పాలు తాగాలి. అలా చేసిన వారు డయాబెటిస్ బారిన పడకుండా ఉన్నారు. US, చైనాలోని వివిధ సంస్థల నుంచి 20 మంది పరిశోధకుల బృందం హిస్పానిక్ కమ్యూనిటీ హెల్త్ స్టడీ/స్టడీ ఆఫ్ లాటినోస్‌లో పాల్గొన్న సుమారు 12,000 మంది హిస్పానిక్ అధ్యయనం నిర్వహించారు.
అయితే క్రమం తప్పకుండా పాలు తాగిన వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 30% తక్కువగా ఉందని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ విశ్వవిద్యాలయంలో పోషకాహార, ఆరోగ్య పరిశోధకుడు లోన్నెకే జాన్సెన్ డుయిజ్‌ఘుయిజ్‌సెన్ చెప్పారు. ఇప్పటికీ రోజుకు 12 గ్రాముల లాక్టోస్‌ను తీసుకోవచ్చని పరిశోధనలో తేలిందని ఆయన వెల్లడించారు. చాలా మంది ఇప్పటికీ రోజుకు 12 గ్రాముల లాక్టోస్‌ను తీసుకోవచ్చని పరిశోధనలో తేలింది.