Entertainment

డిజాస్టర్ డైరెక్టర్ తో ఈ రేంజ్ బిజినెస్ ఎన్టీఆర్ కే సాధ్యం!


‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR).. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర'(Devara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఓ వైపు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, మరోవైపు ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరేలా జరుగుతోంది.

‘దేవర’ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.150 కోట్లకు దక్కించుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ కూడా దిమ్మ తిరిగేలా ఉన్నాయట. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకి రూ.130 కోట్ల ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దాదాపు డీల్ క్లోజ్ అయినట్లు వినికిడి. తెలుగు స్టేట్స్ లోనే ఈ రేంజ్ బిజినెస్ అంటే.. ఇక ఓవరాల్ గా  చూస్తే రూ.200 కోట్ల బిజినెస్ చేయొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ బిజినెస్ రూ.130 కోట్లు అనే న్యూస్ విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ ఘోర పరాజయం పాలైనప్పటికీ.. ఓ డిజాస్టర్ డైరెక్టర్ తో ఈ రేంజ్ బిజినెస్ పెట్టడం ఎన్టీఆర్ కే సాధ్యమని గర్వంగా చెప్పుకుంటున్నారు. బిజినెస్ పరంగా, కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఎన్టీఆర్ కి మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. అందుకే తెలుగు స్టేట్స్ మాదిరిగానే కర్ణాటకలోనూ అదిరిపోయే బిజినెస్ జరుగుతుంది అనడంలో సందేహం లేదు. అలాగే యూఎస్ లోనూ అత్యధిక వన్ మిలియన్ సినిమాలు ఉన్న హీరోలలో తారక్ ఒకడు. కాబట్టి ఓవర్సీస్ లో కూడా భారీగా బిజినెస్ జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ‘వార్-2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో నార్త్ లోనూ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. పైగా ‘దేవర’ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం కరణ్ జోహార్, ఏఏ ఫిలిమ్స్ రంగంలోకి దిగడం బట్టే.. అక్కడ ఈ సినిమా పట్ల ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి పాజిటివ్ టాక్ వస్తే.. దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగానే సౌండ్ చేసేలా ఉన్నాడు.



Source link

Related posts

రాజ్ తరుణ్ కేసులో మరో సంచలనం.. హీరోయిన్ పై హత్యాయత్నం.. మూడు కత్తి పోట్లు…

Oknews

'భారతీయుడు 2' ట్రైలర్.. కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు!

Oknews

చరణ్ 100 కొట్టడం కష్టమే.. ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోండి!

Oknews

Leave a Comment