Entertainment

డిజాస్టర్ సినిమాకు రికార్డు టీఆర్పీ


థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచి, ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణకు నోచుకోని సినిమాలు.. టీవీలలో రికార్డులు టీఆర్ఫీ దక్కించుకోవడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతనే సాధించింది ‘ఆదికేశవ’ మూవీ.

వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ సినిమా గతేడాది నవంబర్‌ 24న థియేటర్లలో విడుదలై ఘోర పరాజయం పాలైంది. డిసెంబర్ 22 నుంచి ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రాగా.. అక్కడా అంతంత మాత్రమే లభించింది. అలాంటివి ఇటీవల టీవీలో ప్రసారం కాగా.. రికార్డు స్థాయిలో ఏకంగా 10.47 టీఆర్ఫీతో సత్తా చాటింది. ఈమధ్య కాలంలో పలువురి స్టార్ల సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు సైతం ఈస్థాయి టీఆర్ఫీని నమోదు చేయలేకపోవడం విశేషం.

జోజు జార్జ్, అపర్ణాదాస్‌, రాధిక, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి జి. వి. ప్రకాష్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా డడ్లీ, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.



Source link

Related posts

తిరగబడరా సామి మూవీ రివ్యూ

Oknews

కేజిఎఫ్ పార్ట్ 3 రెడీ.. యష్ ప్లేస్ లో మరో సూపర్ స్టార్!  

Oknews

చిరంజీవి హీరోయిన్ కి  ప్రభాస్ సినిమాలో నో ఛాన్స్..త్వరలోనే అందరి పేర్లు చెప్తాం

Oknews

Leave a Comment