హారర్ థ్రిల్లర్ జానర్ చిత్రాలలో ‘డిమోంటి కాలనీ’ (Demonte Colony)కి ప్రత్యేక క్రేజ్ ఉంది. 2015లో విడుదలైన ఈ తమిళ మూవీ సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. తెలుగునాట కూడా ఈ సినిమాకి ఎందరో అభిమానులున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది.
అరుళ్‌నితి, ప్రియా భవాని శంకర్ హీరో హీరోయిన్లుగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2). విజయ సుబ్రమణియన్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘డిమోంటి కాలనీ 2’ ట్రైలర్ అదిరిపోయింది. మొదటి సినిమాకి మించి భారీగా రూపొందడంతో పాటు, మరింత థ్రిల్ ని పంచనుందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. కాన్సెప్ట్, విజువల్స్, బీజీఎం అన్ని ఆకట్టుకొని.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తమిళ ట్రైలర్ లో ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. తెలుగు ట్రైలర్ లో మాత్రం ఆగష్టు విడుదల అని పేర్కొన్నారు. ఆగష్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ’35’, ‘ఆయ్’ వంటి తెలుగు సినిమాలతో పాటు.. తమిళ మూవీ ‘తంగలాన్’ విడుదలవుతోంది. ఆగష్టు 15న తెలుగులో విపరీతమైన పోటీ ఉండటంతో.. వారం రోజులు లేట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.