Health Care

డేటింగ్ సైట్లల్లో వెతికీ వెతికీ అలసిపోతున్న యువత.. అలాంటి వ్యసనంతో ..


దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రత్యక్ష పరిచయాలు ఉండటంవల్ల మాత్రమే ప్రేమలు చిగురించి, పెళ్లిదాకా వెళ్లేవి. ఇక ఏ బస్టాపులోనో, కాలేజీల్లోనో ఏర్పడిన పరిచయాలు కూడా ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా వెళ్లేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్‌షిప్ ఏర్పడాలంటే ప్రత్యక్ష పరిచయమే ఉండాల్సిన అవసరం లేదు. ఏ సోషల్ మీడియా వేదికల్లోనూ, డేటింగ్ యాప్‌లు, సైట్లలోనూ నేడు బంధాలు పెనవేసుకుంటున్నాయి. అదే సందర్భంలో కొన్ని పాజిటివ్, నెగెటివ్ అంశాలు కూడా డేటింగ్ కల్చర్‌ను ఫాలో అయ్యేవారిని ప్రభావితం చేస్తున్నాయి.

వెతకడం ఈజీనే కానీ..

ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ కల్చర్ విస్తరిస్తోంది. చాలా మంది తమ లైఫ్ పార్టనర్‌ను లేదా టెంపరరీ రొమాంటిక్ పార్టనర్‌ను పొందడానికి నచ్చిన డేటింగ్ యాప్‌లను, సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఇష్టమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. ముందుగానే అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తిగత, కుటుంబ వివరాలను ప్రొఫైల్ రూపంలో పొందు పర్చడంవల్ల డేటింగ్ సైట్లలో నమోదు చేసుకున్న వ్యక్తులు తమ పార్టనర్‌ను కనుగొనడం ఇప్పుడు ఈజీ అయిపోతోంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

సంబంధాలు – సవాళ్లు

భాగస్వామిని వెతకడం వరకు ఓకే కానీ నచ్చిన వ్యక్తి దొరకడమే అందరికీ అంత సులువైన విషయం కాదంటున్నారు నిపుణులు. ఇక ఈ జనరేషన్‌లో అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి నచ్చడం అనేక అంశాలతో ముడిపడి ఉంటోంది. ఒకప్పుడు తమకు ఒక తోడు కావాలనే ఉద్దేశంతో ఎంచుకునే వారు. త్వరగా సంబంధాలు కుదిరేవి. ఇతర విషయాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు అవతలి వ్యక్తి ఆసక్తిని మాత్రమే కాకుండా అందం, ఆస్తి, భావాలు, కుటుంబ సభ్యుల బ్యాగ్రౌండ్ వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో డేటింగ్ చేయడం, భాగస్వామిని కనుగొనడం, పెళ్లి చేసుకోవడం అనేవి కొందరికి సవాలుగా మారుతోంది.

బర్న్ అవుట్ – పరిష్కారం

పార్టనర్ కోసం కొనసాగే ఆన్‌లైన్ అన్వేషణ పలువురిలో వ్యసనంగా మారుతోంది. బర్న్ అవుట్‌కు దారితీస్తోంది. నిరంతర స్వైపింగ్, గంటల తరబడి చాటింగ్‌లు చేయడం, డేట్స్‌లలో కొనసాగడం చివరకు ఇద్దరి మధ్య రిలేషన్ కుదరకపోవడం, చీటింగ్‌కు గురికావడం వంటివి జరుగుతున్నాయి. పలువురిలో అలసట, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి రుగ్మతలకు దారితీస్తున్నాయి. అలాగని డేటింగ్ కల్చర్ అంతా మోసపూరితమని చెప్పలేం. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డేటింగ్ కల్చర్ నుంచి నుంచి ‘నిశ్శబ్దంగా నిష్ర్కమించండి’ అని సూచిస్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇది ‘Quiet Quitting’ పేరుతో ట్రెండ్ అవుతోంది. డేటింగ్ యాంగ్జైటీస్ తొలగిపోవాలంటే ఇదే సరైన మార్గమని పలువురు పేర్కొంటున్నారు.



Source link

Related posts

రాంగ్ పర్సన్‌ సిగ్నల్ అంటే ఏమిటి?.. సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

Oknews

JAM 2024 పరీక్ష తేది ఎప్పుడో తెలుసా.. మార్గదర్శకాలు ఇవే ..

Oknews

చైత్ర అమావాస్య రోజే మొదటి సూర్యగ్రహణం.. ఆ రాశుల వారికి బ్యాడ్ టైం.. మీ రాశి ఉందా?

Oknews

Leave a Comment