GossipsLatest News

డ్రగ్స్ కేసులో క్రిష్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు


రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు వినిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు క్రిష్ ఇలా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవడం మాత్రం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. క్రిష్ మాత్రం నాకు ఈ కేసుతో సంబంధం లేదు, నేను హోటల్ కి వెళ్ళింది నిజమే, కానీ నేను పార్టీకి వెళ్లలేదు, నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లానంటూ చెప్పినా.. ఇప్పుడు రాడిసన్ డ్రగ్స్ కేసు క్రిష్ మెడకి చుట్టుకున్నట్టుగా పోలీసులు ఆయన్ని A10 గా పేర్కొనడంతో అర్ధమైపోతుంది.

రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటికి వచ్చాయి అని తెలుస్తోంది. వివేక్ ఫ్రెండ్స్ అయిన క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకునేవారని, రాడిసన్ హోటల్ ఆ రోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కూడా పాల్గొన్నాడని, అంతేకాకుండా క్రిష్ రాడిసన్ హోటల్ కి వచ్చిన ప్రతిసారి నిర్భయ్ తో కలిసే డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు అధరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. పోలీస్ రిమాండ్ లో సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసి.. వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తి గత డ్రైవర్ ప్రవీణ్‌కి డ్రగ్స్ సప్లై చేసేవాడని పోలిసుల విచారణలో తేలినట్లుగా సమాచారం.

ఈ పార్టీలో వివేక్ ఆదేశాలు మేరకు 2 గ్రాముల కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేశాడన్నారు. ఈ కొకైన్ కోసం 32000 రూపాయలు ఫోన్ ట్రాన్సిక్షన్స్ ద్వారా జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాడిసన్ హోటల్లోని 1200 & 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించినట్లు పోలిసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారని అంటున్నారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించాడని, క్రిష్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడని అంటున్నారు.

క్రిష్ ఇంకా పోలీస్ విచారణకు హాజరవలేదు. తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను అని తనకి రెండు రోజుల సమయం కావాలని పోలీసులని క్రిష్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈరోజు క్రిష్ పోలిసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు.



Source link

Related posts

శ్రీలీల కి అరుదైన వ్యాధి.. ఇంకా తగ్గలేదా?

Oknews

CM Revanth Reddy vs KCR | Medigadda Barrage | CM Revanth Reddy vs KCR

Oknews

‘గామి’ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment