Health Care

తగ్గునున్న బంగారం ధర.. ఎప్పుడు కొనుగోలు చేయాలంటే..


దిశ, ఫీచర్స్ : బంగారానికీ, భారతీయ సంప్రదాయానికీ అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ నగో నట్రో ధరించాలని ఆశ పడుతుంటారు. మగువల మనసుదోచే అతి విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అది కేవలం గోల్డ్ మాత్రమే అంటుంటారు. పైగా ఇది ఆర్థిక, సామాజిక హోదాకు నిదర్శనంగా భావిస్తారు ప్రజలు. అయితే ప్రజెంట్ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కొంత కాలంగా ఒక గ్రాము గోల్డ్ రేట్ రూ.7 వేలకు పైనే పలుకుతుండగా, శనివారం (6.04.2024) నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,081 పలికి ఆల్ టైం రికార్డ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో కొనే స్తోమతలేక పలువురు ఇబ్బంది పడుతుంటే, మరికొందరు పెరిగిన ధరలను చూసి ఈ సమయంలో కొనాలా? వద్దా? ఒకవేళ కొంటే గనుక ఆభరణాల రూపంలో తీసుకుంటే బాగుంటుందా? బాండ్స్ కొనుగోలు చేస్తా బెటరా? అని ఆలోచిస్తున్నారు. మరి కొందరికి బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అంతుపట్టడం లేదు. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ప్రపంచ వ్యాప్త పరిస్థితులు, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్‌ను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సోర్స్‌గా భావిస్తున్నారు. ఇక ధరలు పెరుగుదలకు గల కారణాలను పక్కన పెడితే, ప్రస్తుతం చాలా మంది ప్రజలు ధర ఎప్పుడు తగ్గుతుందో అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇంటర్నెట్ ఆధారిత సమాచారం, పలువురు నిపుణుల ప్రకారం వచ్చే ఏడాది బంగార రేట్లు తగ్గే చాన్సెస్ ఉన్నాయి. జేపీ మోర్గాన్ వంటి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ కూడా 2025 నాటికి బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడు ధరలు విపరీతంగా, పెరగడం వచ్చే ఏడాది తగ్గనునున్నాయనే అంచనాల నేపథ్యంలో ఏ విధమైన ఇన్వెస్ట్‌మెంట్ బెటర్ అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం బాండ్స్‌ కొనుగోలు చేయడం ఉత్తమని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆభరణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తే టోటల్ రేట్‌లో తరుగు, కమిషన్ కింద 20 శాతం పోతుంది. కానీ అదే బాండ్స్ రూపంలో కొనుగోలు చేస్తే మాత్రం ప్రతీనెల వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ప్రతి గ్రాముపై రూ. 50 వరకు ఖర్చు ఆదా అవుతుందని నిపుణులు అంటున్నారు. మరొక విషయం ఏంటంటే.. నగల మాదిరి బాండ్స్ తప్పి పోతాయనే భయం, ఆందోళన కూడా ఉండదు.



Source link

Related posts

ఒకే ఒక్క ప్రోటీన్ 75 % శాతం క్యాన్సర్ల వ్యాప్తికి కారణం.. ఆపగలిగే మార్గమిదే !

Oknews

Asthma Tips: వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Oknews

సిగరెట్ తాగిన తర్వాత ఈ పండ్లు తిన్నారంటే.. ఎలాంటి హాని కలగదు

Oknews

Leave a Comment