Health Care

తమ పిల్లలతో తల్లిదండ్రులు ఏ వయస్సు వరకు కలిసి నిద్రించాలో తెలుసా..?


దిశ, ఫీచర్స్ : చాలా వరకు పిల్లలు కొంచెం ఎదగంగానే వారికి సెపరేట్ రూమ్ ని కేటాయిస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా ఇతర దేశాల్లో జరుగుతుంది. కానీ భారతదేశంలో మాత్రం అలా కాదు. మన దగ్గర ఎమోషన్స్ ఎక్కువ. పిల్లలపై ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ, అయ్యో ఒంటరిగా పడుకుంటే పిల్లలు భయపడతారేమో అని అనుకుంటారు. అందుకే పిల్లలు ఎంత పెద్దవారైనా పక్కన పడుకోవడం మనకు అలవాటు. కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పిల్లలు ఒంటరిగా నిద్రపోయేలా శిక్షణ ఇవ్వాలని అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది సరికాదు. వారు భవిష్యత్తులో స్వతంత్రంగా పెరగాల్సిన అవసరం వుంది.

బిడ్డ మంచి భవిష్యత్తును ఆలోచించే పేరెంట్స్ గా ఆలోచించండి.అందుకుగాను వారిని చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం కూడా నేర్పించండి. తమకు ప్రత్యేక గది కావాలంటూ పిల్లలే కోరితే, పేరెంట్స్ వారి అవసరాలు గ్రహించి ఏర్పాటు చేస్తే మంచిది. మరి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ వయస్సు వరకు నిద్రించాలి. విడివిడిగా పడుకునే అలవాటు పిల్లలకు ఏ వయస్సు నుంచి నేర్పించాలి? పిల్లలకు ఏ వయస్సులో దాని గురించి చెప్పాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

1. కొద్దిపాటి వయసు తేడాతో ఇద్దరు పిల్లలుంటే….ఇద్దరిని ఒకే గదిలో ఉంచండి. ఇది వారి మధ్య ప్రేమ పెరిగేలా చేస్తుంది. మీరు కూడా వారి మధ్య బంధం ఎలా ఉంది అనేది తేలికగా తెలుసుకోవచ్చు.

2. ఇక ఇతర దేశాలలో పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాలకు విడిగా నిద్రపుచ్చడం అలవాటు చేస్తారు. కానీ మన భారతదేశంలో దాదాపు 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు వారి తల్లిదండ్రులతో పడుకుంటారు. ఇక కొంతమంది పిల్లలకు తమ తల్లి పక్కన లేకుంటే నిద్రపోరు. అందుకే తల్లులు వారి పిల్లలు పడుకున్నంత వరకు పక్కనే ఉంటారు. ఈ అలవాటును కూడా కొద్ది కొద్ది గా మానుకుంటే మంచిది.

3. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే కరెంట్ బిల్లు ఎక్కువై పిల్లలతో పడుకునే తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారని కూడా ఓ అధ్యయనం చెబుతోంది. కానీ పిల్లలకు చిన్నతనం నుంచే ప్రత్యేక గదులు ఇచ్చి తల్లిదండ్రులకు విడివిడిగా పడుకునేలా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కనుక 3 నుండి 4 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రత్యేక గదిని ఇవ్వడానికి సరైన వయస్సు. వారిని అలా నిద్రపోయేలా అలవాటు చేస్తే మానసికంగా బలంగా, ధైర్యంగా మారుతారు.

4. తమ పిల్లలు యుక్తవయస్సుకు ముందు దశకు చేరుకున్నప్పుడు వారితో కలిసి పడుకోవడం మానేయాలి. ఎందుకంటే పిల్లలు యుక్తవయస్సులో వచ్చినప్పుడు వారికి గోప్యత ఇవ్వాలి. ఇది వారి భావాలను ట్యూన్ చేయడానికి సహాయపడుతుంది. వారిలో బాధ్యత భావం, స్వతహాగా ఆలోచించే జ్ఞానం పెరుగుతుంది.

5. ఇక ఎలాంటి పిల్లలు అయిన ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత ప్రతిది గమనిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పడుకోబెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పరిస్థితి చిన్న వయసులో మనస్సులలో ముద్ర పడిపోయింది. చాలా మంది పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టుకుని రోజంత వారి కష్టాలు.. దిన చర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పిల్లల మీద మీ మాటలు చాలా ప్రభావం చూపుతాయి. దాని వల్ల వారు ఒత్తిడికి లోనవుతారు. కనుక చిన్న వయస్సు నుంచి ప్రత్యేక గది లేదా మంచానికి అలవాటు పడితే తల్లిదండ్రులు, పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

వారు పడుకునే గదిని సరిగ్గా పెట్టాలి :

పడుకునే గదిని సరిగ్గా పెట్టాలి. వారి ఆలోచన విధానం ఆ గది నుంచే పెరిగేలా ఉండాలి. అందుకని క్రియేటివ్‌గా గదిని డిజైన్ చేయాలి. పిల్లల గదిలో లైట్లను డిమ్ చేయడం తప్పనిసరి. అలాగే, అనవసర శబ్దాలతో పిల్లలు నిద్రాసమయంలో డిస్టర్బ్ కాకుండా జాగ్రత్త వహించాలి. గదిలో ఫర్నిచర్ అమరికకూ మనం ప్రాధాన్యం ఇవ్వాలి. వారి బెడ్ బాత్‌రూమ్‌ డోర్‌కు నేరుగా ఉండకూడాదు. బాత్రూమ్‌ పాజిటివ్ ఎనర్జీ తక్కువగా ఉండే స్థలం.. కాబట్టి బాత్రూమ్‌ ఎదురుగా ఉండే గోడను ఖాళీగా వదిలేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, పిల్లలు వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగానే గదిని ఏర్పాటు చేయాలి.



Source link

Related posts

ఆ ప్రాంతంలో ఉప్పు టీ చాలా స్పెషల్.. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Oknews

TB బాక్టీరియాను ఏ ఏడాది కనుగొన్నారు.. ఇప్పటివరకు వ్యాధి వ్యాప్తి తగ్గిందా, పెరిగిందా ?

Oknews

Broomstick : ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న చీపుర్లు.. అసలు కథ తెలిస్తే.. కాదా మరి అంటారు..

Oknews

Leave a Comment