Andhra Pradesh

తిరుమలలో వైభవంగా చక్రస్నానం, ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు-tirumala navaratri brahmotsavam completed chakrasnanam with grandeur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirumala Chakrasnanam : తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. అంతకుముందు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.



Source link

Related posts

ఈ పని ముందుగా చేయాల్సింది

Oknews

Ys Jagan on CBN: బాబు పేరు చెబితే మోసాలు, పవన్ పేరు చెబితే పెళ్లిళ్లు మాత్రమే గుర్తుకు వస్తాయన్న సిఎం జగన్

Oknews

సీఎం జగన్ హెలికాప్టర్ల వ్యవహారం ఈసీ వద్దకు-నగదు తరలించే ప్రయత్నమంటూ రఘురామ ఫిర్యాదు-vijayawada news in telugu mp raghu rama complaint on cm jagan helicopter to ec ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment