Tirumala Ugadi Asthanam : ఏప్రిల్ 9న తిరుమల(Tirumala Temple) శ్రీవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం(Ugadi Asthanam) నిర్వహించనున్నారు. ఉగాది(Ugadi 2024) పండుగను పురస్కరించుకుని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, విష్వక్సేనులకు విశేష నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ఆలయ ధ్వజస్తంభం చుట్టూ స్వామి వారు ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఉగాది సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జితసేవలను(Arjitha Seva) టీటీడీ రద్దు చేసింది.