EntertainmentLatest News

తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్


తమ అభిమాన హీరో బర్త్ డే వస్తుందంటే కొత్త సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. నేడు(అక్టోబర్ 23) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. కానీ చివరికి వారికి నిరాశే మిగిలింది.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆయన నటిస్తున్న ‘సలార్’ మొదటి భాగం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ లేదా స్పెషల్ వీడియో విడుదలవుతాయి అనుకుంటే.. సింపుల్ గా ఎడిటెడ్ పోస్టర్ తో బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘క‌ల్కి 2898 ఏడీ'(ప్రాజెక్ట్ k). ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆలస్యమయ్యే అవకాశముంది. అయితే ఈ సినిమా నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ‘సలార్’ టీమ్ విడుదల చేసిన పోస్టర్ నే ట్విట్టర్ లో షేర్ చేసి, బర్త్ డే విషెస్ తెలిపి.. వైజయంతి మూవీస్ అంతకుమించిన షాక్ ఇచ్చింది.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంతవరకు అధికారిక ప్రకటన కూడా రాకుండానే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కనీసం ప్రభాస్ బర్త్ డే కి అయినా.. అనౌన్స్ మెంట్ లేదా టైటిల్ లేదా ఫస్ట్ లుక్.. ఇలా ఏదోక అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సింపుల్ గా బర్త్ డే విషెస్ తో సరిపెట్టింది.

ఇలా తమ అభిమాన హీరో బర్త్ డే కి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.



Source link

Related posts

ts model schools admission application date extended till march 2 apply now

Oknews

Anasuya latest look viral భయపెడుతున్న అనసూయ

Oknews

మహేష్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది..మొదటి తెలుగు సినిమాగా గుంటూరు కారం

Oknews

Leave a Comment