మోదీ సభకు ఏర్పాట్లు పూర్తిప్రధాన మోదీ(PM Modi) సభ ప్రాంగణానికి హెలికాఫ్టర్ లో చేరుకుంటారు. ఇప్పటికే భద్రత దళాలు హెలికాఫ్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వేదిక వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేశారు. మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల నుంచి సభకు భారీగా జన సమీకరణకు బీజేపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ(MP Seats) సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ న్యాయకత్వం ఖరారు చేసింది. అందులో జహీరాబాద్ ఎంపీ సీటుకు బీబీ పాటిల్ ను ఖరారు చేయగా, మెదక్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది.
Source link
previous post