Entertainment

తెలంగాణలో హనుమాన్ మూవీ ప్రస్తుత కలెక్షన్ల పరిస్థితి ఇదే


కళకి సంబంధించి సీనియర్ లు జూనియర్లు ఉండరని ఉండాలసిందల్లా ప్రేక్షకులని రంజింప చేసే టాలెంట్ అని మరోసారి చిత్ర పరిశ్రమకి చాటి చెప్పిన మూవీ హనుమాన్ (hanuman)సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో కి అడుగుపెట్టిన హనుమాన్ అన్ని ఏరియాల్లో కూడా రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తు తన విజయం తాలూకు రేంజ్ ని పెంచుకుంటు పోతుంది. 

హనుమాన్ నైజాం ఏరియాలో ఆరు రోజులకి గాను 13.3 కోట్ల షేర్  వసూలు చేసి ప్రత్యర్థి సినిమాలకి గట్టిగానే సవాలు విసురుతుంది. సంక్రాంతి సెలవులు అయిపోయి ప్రజలు  తమ రోజు వారి పనుల్లో నిమగ్నమయ్యాక కూడా హనుమాన్ కలెక్షన్స్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పైగా నిన్న ఒక్క రోజే నైజాంలో 2 కోట్లకి పైగానే షేర్ ని సాధించింది. దీంతో  హనుమాన్  కలెక్షన్ల తుఫాను ఇప్పట్లో తగ్గేలా లేదని సినీ  ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ హనుమాన్ లోని  ఆర్టిస్టులందరు సూపర్ గా నటించారు. అలాగే  దర్శకుడు ప్రశాంత్ వర్మ  దర్శకత్వ ప్రతిభ కూడా హనుమాన్ ఘన విజయానికి ఒక కారణమయ్యింది. నిరంజన్ రెడ్డి  నిర్మాతగా వ్యవహరించిన ఈ  హనుమాన్ ని వీక్షించిన ప్రతి వ్యక్తి నుంచి ఒక ఐదు రూపాయిలు అయోధ్య రామమందిరానికి విరాళంగా వెళ్తున్నాయి.

 



Source link

Related posts

కల్కి 2898 AD.. అదొక్కటే మైనస్…

Oknews

నేను పట్టుకుంటే తుపాకీ కే దైర్యం వస్తుంది. హ్యాపీ బర్త్ డే మేడం

Oknews

‘కాంతార’ లాంటి సినిమా చేస్తున్న నాని..!

Oknews

Leave a Comment