Telangana

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్, కామారెడ్డి జిల్లా లాస్ట్-rangareddy district is first and kamareddy district is last in telangana inter results ,తెలంగాణ న్యూస్



TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ TS Inter Results ఫలితాల్లో రంగారెడ్డి Rangareddy District జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో కామారెడ్డి జిల్లా kamareddy District ఉంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 71.7శాతం ఉత్తీర్ణత సాధించగా కామారెడ్డిలో 34.81 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను బోర్డు కార్యదర్శి Board Secretary బుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్మీడిట్ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా రెండు సంవత్సరాలకు కలిపి 9,81,003మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1512 పరీక్షా కేంద్రాలను విడుదల చేశారు. పరీక్షల నిర్వహణలో 27వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటు స్పాట్ వాల్యూయేషన్‌లో 14వేల మంది పాల్గొన్నారు.ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4,78,723మంది హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్ధులు 4,30,413మంది ఒకేషనల్ విద్యార్ధులు 48,310మంది ఉన్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 61.06శాతం ఉత్తీర్ణత సాధించారు.ఒకేషనల్ విద్యార్ధుల్లో 50.57శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణులుయ్యారు. ఉత్తీర్ణతా శాథం 60.01శాతంగా ఉంది.ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోజనరల్ విభాగంలో 69.46శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్‌ విద్యార్థుల్లో 63.86శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లో కలిపి 64.19శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 4,01,445మంది హాజరయ్యారు. మరో 54,228మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. ఒకేషనల్ కోర్సుల్లో 42,723మంది హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 1,77,109మంది 75శాతం పైగా మార్కులతో ఏ గ్రేడ్ సాధించారు. 68,378మంది 60శాతానికి పైగా మార్కులతో బి గ్రేడ్ సాధించారు. 25,478మంది 50శాతం మార్కులతో సి గ్రేడ్ దక్కించుకున్నారు. డి గ్రేడ్‌లో 7,891మంది ఉన్నారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 2,78,856మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌గా పరీక్షలు రాసిన 14,740మంది కూడా ఉత్తీర్ణత సాధించారు.జిల్లాల వారీగా టాప్‌ ఇవే…తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 71297మంది పరీక్షలకు హాజరైతే 51121మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71.7శాతం ఉత్తీర్ణత సాధించారు.రెండో స్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది. మేడ్చల్ జిల్లాలో 64,828మంది ఇంటర్ పరీక్షలకు హాజరైతే 46,407మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71.58శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ములుగు జిల్లా విద్యార్థులు నిలిచారు. ములుగు జిల్లా నుంచి 1717 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైతే 70.01శాతంతో 1202మంది ఉత్తీర్ణత సాధించారు.కామారెడ్డి జిల్లా లాస్ట్…తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 7658మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2666మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 34.81శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది.నారాయపేటలో 44.3శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా నుంచి 3781మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరైతే 1675మంది ఉత్తీర్ణత సాధించారు. చివరి నుంచి రెండో స్థానంలో నారాయణ పేట జిల్లా నిలిచింది. చివరి నుంచి మూడో స్థానంలో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్ధులు నిలిచారు. నాగర్ కర్నూలు నుంచి 5363మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైతే 2444 మంది ఉత్తీర్ణత సాధించారు.



Source link

Related posts

Electric Bus Maker Olectra Greentech Limited Reports Rs 27 Crores Net Profit For Q3

Oknews

భారత్ లో క్యాన్సర్ కలవరం, 2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!-khammam news in telugu world cancer day aiims report says 20 lakh cancer deaths in india ,తెలంగాణ న్యూస్

Oknews

election of rajya sabha candidates in telangana is unanimous | Rajyasabha Election: తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Oknews

Leave a Comment