Telangana

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్, పార్టీకి నందికంటి శ్రీధర్ రాజీనామా!-medchal malkajgiri congress leader nandhikanti sridhar resigned to party ,తెలంగాణ న్యూస్


“నా రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికే టికెట్ ఇస్తారా? 1994 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా గుర్తింపు లేదు. ఈసారి టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బీసీలకు ప్రాధాన్యత దక్కడం లేదు. గత ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి లేదా పోటీ చేసిన బీసీ కమ్యూనిటీ నాయకులకు అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. మల్కాజ్ గిరి, మెదక్ నియోజకవర్గాల సీట్లను ఒకే కుటుంబానికి ఎలా కేటాయిస్తున్నారు. బీసీ నాయకులను కాదని మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ కి రెండు సీట్లు కేటాయించడం అన్యాయం. వీళ్లు ఇద్దరూ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి, పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన మైనంపల్లికి టికెట్ కేటాయించాలని చూడడం దుర్మార్గం. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీ ఒక అగ్రకుల కుటుంబానికి సీటు కేటాయించాలని చూస్తుంది. పార్టీ మారిన ఈ ఇద్దరు వ్యక్తులకు సీట్లు ఇవ్వడం అన్యాయం. దీంతో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సీట్లు దక్కవని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.”- నందికంటి శ్రీధర్



Source link

Related posts

Industrial Violations: నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు.. మూడు కంపెనీలు సీజ్ చేసిన తెలంగాణ సర్కారు

Oknews

Former Minister Tummala Nageswara Rao Met Rahul Gandhi In Delhi

Oknews

Harish Rao Assembly: అప్పుడప్పుడు కెమెరాల్లో తమనూ చూపించాలంటున్న హరీశ్ రావు

Oknews

Leave a Comment