రుణమాఫీ పైన బహిరంగ చర్చకు సిద్ధమాదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న కేసీఆర్, రూ లక్ష రుణమాఫీ(Loan Waiver) చేయలేక బోల్తాపడ్డాడని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందో చేసి చూపించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తే సుమారుగా రూ 34,000 కోట్లు అవసరం అవుతాయని, ప్రభుత్వం నిధులు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని కోరారు. రుణమాఫీపై బహిరంగచర్చకు నేను సిద్ధం…రేవంత్ నువ్వు సిద్ధమా అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. అలవికాని హామీలు చేసి, ప్రజలను కాంగ్రెస్ పార్టీ గోల్ మాల్ చేసిందని విమర్శించారు.
Source link